AC : వేసవికాలం రాగానే చాలామంది చల్లదనం కోరుకుంటారు. కొందరు మధ్యతరగతి ప్రజలు కూలర్లను ఏర్పాటు చేసుకుంటారు. కాస్త డబ్బు ఉన్నవారు ఏసీలు కొనుగోలు చేస్తారు. అయితే ప్రస్తుత కాలంలో తక్కువ ధరలో కూడా ఏసీలు లభిస్తున్నాయి. కంపెనీలను బట్టి ఇవి ధరలు మారుతూ ఉంటాయి. అయితే ఏసీలు ఎవరు కొనుగోలు చేసిన కరెంటు బిల్లు తడిసి మోపెడు అవుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ తెలివికొద్ది వాడటం వల్ల ఏసీ కి కరెంటు బిల్లు తక్కువగా వచ్చే విధంగా చేయొచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఎలాంటి టిప్స్ వాడాలంటే?
సాధారణంగా రాత్రి సమయాల్లో ఇళ్లలో ఏసీలు ఆన్ చేస్తూ ఉంటారు. కానీ వేసవికాలంలో మాత్రం 24 గంటలు వేసి రన్ అయ్యే అవకాశం ఉంటుంది.ఈ క్రమంలో ఒక టన్ ఏసీ గంటకి 800నుంచి 1200 వాట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అదే 1.5 టన్కు 1200 నుంచి 1800 వాట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. దీనిని యూనిట్ ధరతో లెక్కించి బిల్లు జనరేట్ చేస్తారు. అయితే వేసవికాలంలో ఎక్కువగా ఏసీ ని వినియోగించడం వల్ల ఎక్కువ బిల్లు వస్తుంది. కానీ కొన్ని టిప్స్ పాటించడం ద్వారా తక్కువ బిల్లును వచ్చేలా చేయొచ్చు.
Also Read : మీ ఏసీ డిస్‌ప్లేలో ఇవి కనిపిస్తున్నాయా.. పెద్ద సమస్య వచ్చినట్లే!
చాలామంది ఏసీ ని తక్కువ టెంపరేచర్లో ఉంచుతూ ఉంటారు. కానీ 22 నుంచి 26 సెంటీ గ్రేడ్ లోపు మాత్రమే టెంపరేచర్ను సెట్ చేసుకోవాలి. ఎంత వేడి ఉన్న ఈ టెంపరేచర్ను ఫాలో అవుతే ఏసీ ఫై ఎలాంటి భారం పడదు. అంతేకాకుండా ఎక్కువ రోజులు ఏసి పాడుకాకుండా ఉంటుంది.
ఒక గదిలో వేడిగా ఉన్నప్పుడు అందులోని కిటికీలను తలుపులను వేస్తూ ఉండాలి. వీటిని ఓపెన్ చేయడం ద్వారా ఏసీ బయటకు పోయి వేడిగాలి లోపలికి వస్తుంది. దీంతో ఏసీ టెంపరేచర్ ఎక్కువగా పెంచాల్సి వస్తుంది. అందువల్ల చాలావరకు డోర్లు, కిటికీలను మూసి ఉంచడం వల్ల ఏసీ టెంపరేచర్ తక్కువ అవసరం పడుతుంది.
గదిలో ఎక్కువ కూల్ నమోదైనప్పుడు ఆటోమేటిగ్గా ఆఫ్ అయ్యే విధంగా ఏసీ ని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవడం ద్వారా ఏసి వినియోగం తక్కువగా ఉంటుంది. దీంతో కరెంట్ బిల్లు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా చల్లగా రాకుండా గదిని నార్మల్గా కూల్ గా వస్తుంది.
ఏసీ నీ దాదాపుగా వేసవిలోనే ఎక్కువగా వినియోగిస్తారు. అయితే మధ్యకాలంలో దీనిని ఆఫ్ చేసి మళ్లీ వేసవి వచ్చేవరకు వాడరు. అయితే ఏసీ ని వినియోగించే ముందే దీనిని శుభ్రం చేయాలి. ఇందులో ఎలాంటి దుమ్ము ధూళి లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇటీవల కొన్ని ఏసీల్లో పాములు కూడా బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో దమ్ము ధూళి ఉండడం వల్ల ఏసీ ఎక్కువగా వినియోగం అయ్యే అవసరం ఉంటుంది.
ఏసీ తో పాటు ఫ్యాన్ ను కూడా ఉపయోగించాలి. ఎందుకంటే ఫ్యాన్ వల్ల గది మొత్తం కూల్ గా మారుతుంది. దీంతో ఏసి వినియోగం తక్కువగా అవసరం ఉంటుంది. ఫలితంగా టెంపరేచర్ తగ్గే అవకాశం ఉంటుంది.
Also Read : ఈ ఏసీ ఉంటే కరెంట్ బిల్లు టెన్షన్ ఉండదు.. రాత్రింబవళ్లు వాడినా నో ప్రాబ్లమ్!