House: సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరి కల. కానీ ఈ కలలో కొందరు మాత్రమే నెరవేర్చుకుంటారు. రోజురోజుకు ఇళ్ల ధరలు పెరిగిపోతుండడంతో తక్కువ ధరలో ఇల్లు కొనాలని చూస్తుంటారు. అయితే కొంతమంది నిపుణులు తెలిపిన ప్రకారం పూర్తిగా నిర్మాణం అయిన ఇల్లు కంటే.. నిర్మాణం జరుగుతున్న ఇల్లును కొనుగోలు చేయడం ద్వారా తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో కొంతమంది నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసి వారికి అనుగుణంగా మార్చుకోవచ్చని అనుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఇలా చేస్తే సమస్యలు ఉంటాయని తెలుపుతున్నారు. అసలు నిర్మాణంలో ఉన్న ఇల్లు కొనడం మంచిదేనా? పూర్తయిన ఇల్లు కొంటె ఎలాంటి లాభాలు ఉంటాయి?
కొంతమంది సొంత ఇల్లును తమకు నచ్చిన విధంగా నిర్మించుకోవాలని అనుకుంటారు. ఇలాంటివారు కన్స్ట్రక్షన్ ప్రారంభం అయిన ఇంటిని కొనుగోలు చేసి వారికి అనుగుణంగా డిజైన్ చేసుకుంటారు. ఇలాంటి వారికి ఈ ఇల్లు అనుకూలంగా ఉంటుంది. కొందరు రియల్ బిల్డర్లు తెలుపుతున్న ప్రకారం పూర్తి అయిన ఇల్లు కంటే నిర్మాణంలో ఉన్న ఇల్లు పది నుంచి 30% వరకు తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా ఇలాంటి నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసి.. ఆ తర్వాత రీసెల్ చేసినా కూడా అంతే ధర వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డబ్బులు కట్టిన చాలా రోజుల వరకు ఇల్లు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. బుకింగ్ నుంచి డెలివరీ తేదీ వరకు చాలా సమయం పట్టి అవకాశం ఉంటుంది. అయితే ఇలా నిర్మాణంలో ఉన్న ఇల్లు ధర రూ. 45 లక్షల లోపు ఉంటే ఒక శాతం మాత్రమే జీఎస్టీ విధిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉంటే ఐదు శాతం జీఎస్టీని విధిస్తారు. నిర్మాణంలో ఉన్న ఇంటికి టాక్స్ బెనిఫిట్స్ ఉండే అవకాశాలు ఉండవు. అయితే ఈ ఇంటి నిర్మాణం మూడేళ్ల లోపు పూర్తి చేయగలిగితే రూ.2.50 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది.
నిర్మాణం పూర్తయిన ఇంటికి నేరుగా వెళ్లి జీవనాన్ని కొనసాగించవచ్చు. కొందరు బిల్డర్లు ఇన్నర్ కబోర్డ్స్ తో పాటు బాత్రూం ఫిట్టింగ్, కొన్ని రకాల ఫర్నిచర్ ను కూడా ఏర్పాటు చేసి ఇస్తున్నారు. కొన్ని ప్రదేశాల్లో ఏసీ తో పాటు గ్యాస్ స్టవ్ కూడా రెడీ చేసి ఇస్తున్నారు. చేతిలో డబ్బులు ఉంటే వెంటనే చెల్లించి ఇందులో నివాసం కొనసాగించవచ్చు. రెడీమేడ్ గా ఉన్న ఇంటికి ఎన్ఓసి వస్తే జిఎస్టి చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇందులోను కొన్ని సమస్యలు లేకపోలేదు. నిర్మాణంలో ఉన్న ఇంటికంటే నిర్మాణం పూర్తయిన ఇంటి ధర ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న డిజైన్ లేకపోతే తిరిగి మార్చుకునే అవకాశం ఉండదు. ఇల్లు పూర్తయిన దానికి లోన్ తీసుకుంటే అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కొందరు వాస్తు ప్రకారం గా ఇంటిని మార్చుకోవడానికి అవకాశం ఉండదు.