Mutual Fund: నెలకు రూ.10000 పెట్టుబడితో రూ.9 లక్షల పెన్షన్.. ఎలా అంటే?

Mutual Fund: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలని భావించే వాళ్లు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి నెలా చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీపై ఎక్కువ మొత్తంలో పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన డబ్బును అనేక రెట్లుగా పెంచడంలో ఉపయోగపడుతుంది. పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందాలని అనుకునే వాళ్లు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. 30 సంవత్సరాల పాటు […]

Written By: Navya, Updated On : November 30, 2021 5:17 pm
Follow us on

Mutual Fund: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలని భావించే వాళ్లు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి నెలా చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీపై ఎక్కువ మొత్తంలో పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన డబ్బును అనేక రెట్లుగా పెంచడంలో ఉపయోగపడుతుంది. పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందాలని అనుకునే వాళ్లు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.

Mutual Fund

30 సంవత్సరాల పాటు నెలకు 10,000 రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఆ వ్యక్తి మెచ్యూరిటీ తర్వాత 12 కోట్ల రూపాయల 70 లక్షలు పొందే అవకాశం అయితే ఉంది. అయితే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీర్ఘకాలంలో మార్కెట్ రిస్క్ తగ్గి ఎక్కువ రాబడి పొందే అవకాశం ఏర్పడుతుంది. వార్షిక ఆదాయం పెరిగితే అదే విధంగా సిప్ మొత్తాన్ని కూడా పెంచాలి.

Also Read: బ్యాంక్ లో ఈ అకౌంట్ తెరిస్తే 10 వేల రూపాయల లోన్.. ఎలా అంటే?
30 సంవత్సరాల పాటు ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టే పెట్టుబడులకు 12 శాతం రాబడిని ఆశించవచ్చు. కొన్నిసార్లు రాబడి మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ కూడా ఉంది. 30 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేతే మెచ్యూరిటీ మొత్తాన్ని బట్టి పెన్షన్ ను నిర్ణయించవచ్చు. 12.70 కోట్ల మెచ్యూరిటీ మొత్తాన్ని పొందే వ్యక్తి నెలకు 9 లక్షల రూపాయల పెన్షన్ ను పొందుతాడు.

సమీపంలోని బ్యాంకులను సంప్రదించి మ్యూచువల్ ఫండ్ కు సంబంధించిన పూర్తి వివరాలను పొందవచ్చు. ఎక్కువ మొత్తంలో ఆదాయం సంపాదించే వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్లకు శుభవార్త.. రైల్వేలో జాబ్స్!