Politics: రాష్ట్రంలో తగువులాట.. ఢిల్లీలో నాటకీయత?

Politics: కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీ విషయంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఒకేలా వ్యవహరిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఎదగకుండా చర్యలు తీసుకుంటూనే ఢిల్లీలో నాటకీయతను ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీతో చీటికిమాటికి తగువును పెట్టుకునే టీఆర్ఎస్, వైసీపీ నేతలు కేంద్రం విషయంలో మాత్రం రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తున్నారు. నిజానికి కేంద్రంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తేల్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేంద్రం పరిష్కారించాల్సిన సమస్యలు చాలావరకు పెండింగ్ లోనే ఉన్నాయి. జల, […]

Written By: NARESH, Updated On : November 30, 2021 12:54 pm
Follow us on

Politics: కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీ విషయంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఒకేలా వ్యవహరిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఎదగకుండా చర్యలు తీసుకుంటూనే ఢిల్లీలో నాటకీయతను ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీతో చీటికిమాటికి తగువును పెట్టుకునే టీఆర్ఎస్, వైసీపీ నేతలు కేంద్రం విషయంలో మాత్రం రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తున్నారు.

TRS YCP Politics

నిజానికి కేంద్రంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తేల్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేంద్రం పరిష్కారించాల్సిన సమస్యలు చాలావరకు పెండింగ్ లోనే ఉన్నాయి. జల, విద్యుత్ ప్రాజెక్టుల సమస్యలు, పెండింగ్ నిధులు, జాతీయ ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులు, ప్రాజెక్టులు తదితర సమస్యలు అనేకం ఉన్నాయి.

తెలంగాణలో క్రమంగా బీజేపీ బలపడుతున్న ప్రతీసారి సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీతో కయ్యానికి సిద్ధమవుతుంటారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నిస్తుంటారు. అప్పట్లో వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చిన కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ హుజూరాబాద్లో ఓటమి పాలవగానే మాటమార్చారు. కేంద్రంతో తాడోపేడోకు సిద్ధమంటూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు, దీక్షలకు సిద్ధమయ్యారు.

తెలంగాణలో పండించిన వరిధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుగుబాటు జెండా ఎగురవేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన వ్యూహాత్మకంగా బీజేపీపై పోరుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక జగన్ సర్కార్ మాత్రం కేంద్రంతో డైరెక్ట్ గా ఫైట్ చేయలేకపోతుంది.

రాజ్యసభ, లోక్ సభలో వైసీపీకి చాలామంది ఎంపీల బలం ఉంది. అయినప్పటికీ ఆ పార్టీ బీజేపీ కొట్లాడి సమస్యలను పరిష్కారించుకోలేకపోతుంది. అప్పుల ఊబిలో కురుకపోయిన ఏపీ కేంద్రంతో పోరాడితే అసలుకే మోసం వస్తుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో సామరస్యంగానే సమస్యలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు.

Also Read: కాంగ్రెస్ బలోపేతం.. టీఆర్ఎస్ కు ఆనందమా?

బీజేపీ మాత్రం తన అవసరానికి వైసీపీని, టీఆర్ఎస్ ను వాడుకుంటుంది. పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బిల్లుల విషయంలో ఈ రెండు పార్టీల మద్దతును కూడగట్టుకుంటోంది. అయితే  ఈ రెండు పార్టీలు కూడా లోపాయికారిగా కేంద్రంలోని బీజేపీని నొప్పించకుండానే వ్యతిరేకిస్తున్నట్లు మాత్రం ప్రజల్లోకి సంకేతాలు పంపిస్తున్నాయి. బీజేపీ సైతం వీరితో అలానే వ్యవరిస్తోంది.

రాష్ట్రానికి వచ్చేటప్పటికీ మాత్రం టీఆర్ఎస్, వైసీపీలు రాజకీయంగా ఢిల్లీలోని బీజేపీని ఎదురిస్తున్నామనే బూచిని చూపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఇప్పటికైనా ఈ రెండు పార్టీలు సమస్యలను పక్కదారి పట్టించకుండా ప్రజలకు మంచిచేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Also Read: కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ పక్కా వ్యూహం?

Tags