Budget  2024 : బడ్జెట్ వచ్చేస్తుందోచ్..లాభాలిచ్చే 8 స్టాక్స్ మీ వద్ద ఉన్నాయా..?

అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ టార్గెట్ ధర రూ. 1350 వద్ద ఉంది. అంటే ఇది ప్రస్తుత మార్కెట్ ధర రూ. 1260 కంటే దాదాపు 8.5 శాతం ఎక్కువ. దీంతో ఈ విలువ లాభాలను తెచ్చే అవకాశం ఉంటుందని, ఆదాయం వృద్ధికి ఇది దోహదం చేస్తుందని బ్రోకరేజ్ అంచనా వేస్తుంది.

Written By: NARESH, Updated On : July 18, 2024 4:27 pm

Budget  2024

Follow us on

Budget  2024 : కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఈ నెల పార్లమెంట్ లో బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమైంది. ఆర్థిక వ్యవస్థ ఊపందుకునేందుకు కేంద్రం తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ప్రీ బడ్జెట్ విశ్లేషణలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇందులో చాలా కంపెనీలు, ఇన్వెస్టర్లకు లాభాలు ఖాయమనే అంచనా వినిపిస్తోంది. అయితే ఇందులో 8 బుల్లెట్ స్టాక్ లు కీలక లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

ఐసీఐసీఐ బ్యాంక్..
అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ టార్గెట్ ధర రూ. 1350 వద్ద ఉంది. అంటే ఇది ప్రస్తుత మార్కెట్ ధర రూ. 1260 కంటే దాదాపు 8.5 శాతం ఎక్కువ. దీంతో ఈ విలువ లాభాలను తెచ్చే అవకాశం ఉంటుందని, ఆదాయం వృద్ధికి ఇది దోహదం చేస్తుందని బ్రోకరేజ్ అంచనా వేస్తుంది.

కోలిండియా..
ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా షేర్లకు రూ. 550 టార్గెట్ ధరగా నిర్ణయించింది. ప్రస్తుత మార్కెట్ లో కోలిండియా షేర్ ఒక్కోటి రూ. 512 వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. ఇక మైనింగ్ రంగంలో టాప్ లో ఉన్న కోలిండియా మోతీలాల్ ఓస్వాల్ టాప్ పిక్ గా కనిపిస్తోంది. తక్కువ ఖర్చుతో సానుకూల పవనాలను సూచిస్తున్నది.

హెచ్‌సీఎల్ టెక్..
టాప్ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ కూడా మార్కెట్ లో దూసుకుపోయే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం షేర్లకు టార్గెట్ ధర రూ. 1710 ఉంది. ఈఆర్ అండ్ డీ రంగంలో హెచ్‌సీఎల్ కు ఉన్న బలమైన వనరులు, అవుట్ సోర్సింగ్ అవకాశాలు, డిజిటల్ ఇంజినీరింగ్ వ్యవస్థ ఈ ఆదాయాలను పెంచేందుకు నిరంతర పెట్టుబడులకు భవిష్యత్ లో స్థిరమైన వృద్ధిని అందించే అవకాశం ఉన్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ప్రకటించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ కూడా తన టార్గెట్ ధరను రూ. 880గా నిర్ణయించింది. ఇది ప్రస్తుత స్టాక్ ట్రేడింగ్ కంటే దాదాపు సుమారు 19.5 శాతం అధికంగా ఉంది. ప్రస్తుతం బలమైన సాంకేతిక వనరులు ఉన్న ఎస్బీఐని సద్వినియోగం చేసుకోవాలని బ్రోకరేజ్ తెలిపింది.

ఎల్ అండ్ టీ..
దిగ్గజ ఎల్ అండ్ టీ ప్రస్తుతం టాప్ లిస్టింగ్ లో కొనసాగుతోంది. బ్రోకరేజీ సంస్థ ఈ కంపెనీ షేర్లకు రూ. 4150 ధరగా నిర్ణయించింది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ ట్రేడింగ్ రూ. 3627గా కొనసాగుతున్నది. రాబోయే త్రైమాసికంలో తక్కువ మార్జిన్ లెగసీ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఈ సంస్థ మరింత మెరుగుదలను చూపుతుందని బ్రోకరేజ్ పేర్కొంది.

మహీంద్రా అండ్ మహీంద్రా..
మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థ కూడా టాప్ లో నిలిచింది. ప్రస్తుతం కొత్త టార్గెట్ ధర రూ. 3300 గా ఉంది. ఇది సుమారుగా 21శాతం పెరుగదలను సూచిస్తుంది. రాబడులపై స్పష్టమైన హామీతో మూలధన కేటాయింపును కొనసాగించడం స్టాక్ రీ రేటింగ్ కు దారితీస్తందని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది.

మ్యాన్ కైండ్ ఫార్మా..
ఫార్మా కంపెనీ షేర్లకు బ్రోకరేజ్ రూ. 2650 నిర్ధేశిత లక్ష్యాన్ని నిర్ణయించింది. కాగా 23 శాతం కంటే ఎక్కువ పెరుగుదల ఖాయమని తెలిపింది. బలమైన బ్రాండ్ ఔట్ లుక్ ద్వారా స్థిరమైన ఆదాయాల వృద్ధి, మెరుగైన రాబడి ఉంటుందని చెప్పింది.

చోళా ఇన్వెస్ట్ మెంట్..
ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ రానున్న కాలంలో రూ. 1660 లక్ష్యాన్ని చేరుకుంటుంందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఇది 17 శాతం అధికమని పేర్కొంది. చోళా ప్రస్తుతం 8 ఫిన్ టెక్ కంపెనీలతో సహకరిస్తున్నట్లు మంచి స్థాయికి చేరినట్లు బ్రోకరేజీ సంస్థ చెప్పింది.