https://oktelugu.com/

Mahindra Thar: ఆ కారును 76,000 మంది బుక్ చేసుకున్నారు.. కారణం ఇదే…

మహీంద్రా.. ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రస్తుతం మహీంద్ర థార్ దూసుకుపోతుంది. అంతకుముందు ఎన్నో విభిన్న మోడళ్లు మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకున్నాయి. ధర కాస్త ఎక్కువే అయినా రిచ్ లెవల్లో ఆకట్టుకుంటాయి ఈ కంపెనీ కార్లు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 17, 2023 / 09:15 AM IST

    Mahindra Thar

    Follow us on

    Mahindra Thar: ఆ కార్లు అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. ప్రతినెలా 51 వేల బుకింగ్ అవుతూ దూసుకుపోతున్నాయి. మోడల్, డిజైన్, ఫీచర్స్ ఆకట్టుకోవడంతో చాలా మంది కార్ల వినియోగదారులు ఆ కార్లు కావాని ఎగబడుతున్నారు. దీంతో కార్ల విక్రయాల్లో టాప్ స్టేజిలోకి వెళ్లింది ఆ కంపెనీ. కొత్త కొత్త మోడళ్లను ఎప్పటికప్పుడు ఆవిష్కరిస్తూ.. విభిన్న తరహాలో కార్లను తీసుకొస్తున్న ఆ దేశీయ కంపెనీ గురించి తెలుసుకుందామా..

    మహీంద్రా.. ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రస్తుతం మహీంద్ర థార్ దూసుకుపోతుంది. అంతకుముందు ఎన్నో విభిన్న మోడళ్లు మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకున్నాయి. ధర కాస్త ఎక్కువే అయినా రిచ్ లెవల్లో ఆకట్టుకుంటాయి ఈ కంపెనీ కార్లు. ఫారిన్ కార్లతో పోటీ పడుతూ అమ్మకాల్లో దూసుకుపోతుంటాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. ప్రతీ నెల ఈ కంపెనీ కార్లు 51 వేల యూనిట్లు విక్రయం జరుపుకుంటున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

    కొంతకాలంలో మహీంద్రా బుకింగ్ లు పెరిగిపోయాయి. మహీంద్రా కంపెనీకి చెందిన XUV300, XUV400, XUV 700 వంటి మోడళ్లు ఆరునెలల్లో నవంబర్ 1 వరకు 2.86 లక్షల ఆర్డర్లు కలిగినట్లు కంపెనీ ప్రకటనలో తెలిపింది. అంటే ప్రతి నెల 51,000 కొనేందుకు రెడీగా జరిగినట్లు తెలుస్తోంది. వీటిలో XUV300, XUV400 మోడళ్లను 10,000… XUV700 ను 70,000.. థార్ ను 76,000ను అత్యధికంగా బుక్ చేసుకున్నారు. అలాగే బొలెరో 11,000 యూనిట్లు కోసం రెడీగా ఉన్నారు.

    జూలై-సెప్టెంబర్ మధ్య కంపెనీ 1,14, 742 ఎస్ యూవీలను విక్రయించింది. వీటితో దేశంలోనే రెండో అత్యుత్తమ ఎస్ యూవీగా మహీంద్రా నిలిచింది. అలాగే ఈ ఆరు నెలల్లో మహీంద్రా వాటా 19 శాతం పెరిగింది. 2024లో ఫస్ట్ ఎలక్ట్రికల్ కారును విడుదల చేయనుంది. ఇక బుకింగ్ చేసుకున్న వారికి అనుగుణంగా యూనిట్ల ఉత్పత్తి ఉంటుందని, ఆ తరువాత వారికి డెలివరీ చేస్తామని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.