7 Seater Cars: భారతదేశంలో ప్రస్తుతం SUVలకు డిమాండ్ పెరుగుతోంది. కానీ చాలా కార్లలో 5 సీటర్ ఆప్షన్ మాత్రమే వస్తోంది. దీంతో పెద్ద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. మీరు ఎక్కువ మందితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటే 7 సీటర్ కారు కొనడం ఉత్తమం. ఈ కార్లను MPV (మల్టీ పర్పస్ వెహికల్) అని కూడా అంటారు. అంటే వీటిని అనేక సందర్భాల్లో ఉపయోగించవచ్చు. ఇక్కడ భారతదేశంలో లభించే 4 చౌకైన 7 సీటర్ కార్ల గురించి తెలుసుకుందాం.
1. మారుతి ఎర్టిగా
అత్యంత విజయవంతమైన, ఎక్కువ డిమాండ్ ఉన్న MPVలలో మారుతి ఎర్టిగా ఒకటి. ఇది పెట్రోల్, CNG ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఈ కారులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 101.6 bhp పవర్, 136.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్‌తో జతచేయబడి ఉంటుంది. ఎర్టిగాలో 7-ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, USB ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, EBDతో కూడిన ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. మారుతి ఎర్టిగా బేస్ మోడల్ ధర రూ.8.84 లక్షల నుండి ప్రారంభమవుతుంది.. టాప్ మోడల్ ధర రూ. 13.13 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
2. రెనాల్ట్ ట్రైబర్
ట్రైబర్ మార్కెట్లో అత్యంత చౌకైన 7 సీటర్ కారు. ఇందులో 999cc న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 71 bhp పవర్, 96 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనం మాన్యువల్ , AMT అనే రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ట్రైబర్‌లో 625 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇందులో 7-ఇంచుల TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, EBD, ESPతో కూడిన ABS వంటి ఫీచర్లు ఉన్నాయి. రెనాల్ట్ ట్రైబర్ బేస్ మోడల్ ధర రూ.6.10 లక్షల నుండి ప్రారంభమవుతుంది.. టాప్ మోడల్ ధర రూ.9.02 లక్షల వరకు ఉంటుంది (సగటు ఎక్స్-షోరూమ్).
3. కియా కారెన్స్
కియా కారెన్స్ ఒక ప్రసిద్ధ MPV. ఇది 1.5-లీటర్ పెట్రోల్ NA, 1.5-లీటర్ పెట్రోల్ టర్బో, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ఇది 10.25-ఇంచుల స్క్రీన్‌లు (ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం), సింగిల్-పానల్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వన్-టచ్ సెకండ్-రో సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి అనేక ఫీచర్లతో నిండి ఉంది. ఇది 6, 7 సీటర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. కియా MPV 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, డ్యూయల్ డాష్‌క్యామ్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. కియా కారెన్స్ బేస్ మోడల్ ధర రూ. 10.60 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ధర రూ. 19.70 లక్షల వరకు ఉంటుంది .
4. మహీంద్రా బొలెరో నియో
బొలెరో నియో కూడా ఒక అద్భుతమైన 7 సీటర్ కారు. ఇందులో 3.5-ఇంచుల LCDతో కూడిన ట్విన్-పాడ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్‌తో 7-ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎకో డ్రైవ్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్, ముందు , రెండవ వరుసలో ఆర్మ్‌రెస్ట్‌లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ABSతో కూడిన EBD, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్ , రివర్స్ పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బొలెరో నియోలో 1,493 cc డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 72 bhp పవర్, 260 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. మహీంద్రా బొలెరో నియో బేస్ మోడల్ ధర రూ.9.95 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ధర రూ. 12.16 లక్షల వరకు ఉంటుంది.