https://oktelugu.com/

Jabardasth : జబర్దస్త్ కమెడియన్ ని కుక్క అన్న జడ్జి ఇంద్రజ.. వైరల్ అవుతున్న వీడియో!

ముందుగా ఆటో రాంప్రసాద్ ఈసారి శ్రీరామ నవమి పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి మనం అందరం భద్రాచలం వెళ్తున్నాం అని చెప్తాడు. ఇక కమెడియన్స్ తో పాటు యాంకర్ రష్మీ, ఇంద్రజ అంతా కలిసి శ్రీరాముడి విగ్రహాలు తీసుకుని వస్తారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 15, 2024 / 08:48 AM IST

    Jabardasth

    Follow us on

    Jabardasth : శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శ్రీరామ నవమి పండుగ నేపథ్యంలో ఎపిసోడ్ స్పెషల్ గా రూపొందించారు.అయితే జడ్జి ఇంద్రజ ఓ కమెడియన్ ని కుక్క తో పోల్చింది. పబ్లిక్ లో దారుణంగా అతన్ని కుక్క అనడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరు? ఇంద్రజ అతన్ని అంత మాట ఎందుకు అనాల్సి వచ్చిందో? తెలుసుకుందాం.

    ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణించింది ఇంద్రజ. పెళ్లయిన తర్వాత యాక్టింగ్ కు పూర్తిగా దూరమైంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంద్రజ తల్లి, అత్త పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటుంది. మరోవైపు బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షో లకు జడ్జి గా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో ఇంద్రజ చేసిన కామెంట్స్ ఒకింత ఆశ్చర్యానికి గురి చేశాయి. జబర్దస్త్ కమెడియన్ ని ఆమె కుక్కతో పోల్చింది.

    ముందుగా ఆటో రాంప్రసాద్ ఈసారి శ్రీరామ నవమి పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి మనం అందరం భద్రాచలం వెళ్తున్నాం అని చెప్తాడు. ఇక కమెడియన్స్ తో పాటు యాంకర్ రష్మీ, ఇంద్రజ అంతా కలిసి శ్రీరాముడి విగ్రహాలు తీసుకుని వస్తారు. ఈ క్రమంలో ఇంద్రజ చేతిలో లో ఉన్న కొబ్బరిచిప్ప, ప్రసాదం పట్టుకోమని కమెడియన్ బాబుకి ఇస్తుంది. దీంతో బాబు ఆ ప్రసాదం నోట్లో వేసుకుని తింటుంటాడు.. ఇంతలో ఇంద్రజ అది ప్రసాదం కాదు అంటుంది.

    అది మనం తినడానికి కాదు .. ఏ కోతికో .. కుక్కకో ఇవ్వమన్నారు అని అంటుంది. ఇంతలో నూకరాజు కలగజేసుకుని .. అది ఆల్రెడీ కోతి దగ్గరకే వచ్చింది అని కమెడియన్ బాబుని ఉద్దేశిస్తూ అంటాడు. దానికి ఇంద్రజ అయితే కొంచెం కుక్కకి కూడా పెట్టు అంటూ నూకరాజు పై పంచ్ వేసింది ఇంద్రజ. నూకరాజు దెబ్బకు షాక్ అయ్యాడు. అతని మొహం తెల్లబోయింది. ఏమనాలో అర్థం కాక నోరువెళ్ళబెట్టాడు. దీంతో యాంకర్ రష్మీ తో పాటు అక్కడున్న వాళ్ళందరూ తెగ నవ్వేశారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.