Homeబిజినెస్2026 Toyota Highlander: 2026 టయోటా హైలాండర్‌.. ఆకట్టుకుంటున్న 7 సీటర్‌ ఎస్‌యూవీ

2026 Toyota Highlander: 2026 టయోటా హైలాండర్‌.. ఆకట్టుకుంటున్న 7 సీటర్‌ ఎస్‌యూవీ

2026 Toyota Highlander: ప్రముఖ మోటార్‌ సంస్థ టయోటా 2026 ప్రారంభంలోనే కొత్త వాహనం లాంచ చేసింది. హైలాండర్‌ మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీని మరింత సుఖవంతంగా మార్పుచేసి మార్చింది. ఫ్లాషీ ట్రెండ్‌లకు అతీతంగా, కుటుంబాల అవసరాలైన సౌకర్యం, హైబ్రిడ్‌ సామర్థ్యం, నగరాలు–హైవేల మీద సులభ ప్రయాణానికి దృష్టి పెట్టింది. ఫలితంగా, రోజువారీ జీవితానికి సిద్ధమైన వాహనం ఆవిర్భవించింది.

అమెరికన్‌ రోడ్లకు సరిపోయేలా..
2026 మోడల్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, విస్తృత గ్రిల్, మెరుగైన శరీర ఆకృతులు ఆకర్షణ పెంచాయి. పక్కిలో సమతుల్యత, వెనుక లైటింగ్‌లో మెరుగులు ప్రీమియం లుక్‌కు దోహదపడ్డాయి. నగరాలు–హైవేల్లో సమానంగా మెరిసే డిజైన్‌.

7–సీటర్‌ ఇంటీరియర్‌
మూడు వరుసల సీటింగ్‌ రియల్‌ ఫ్యామిలీస్‌కు రూపొందించారు. రెండో వరుసలో విశాలంగా, మూడో వరుసలో ³ల్లలు–పెద్దలకు సరిపడా స్థలం. మెత్తని మెటీరియల్స్, మెరుగైన కుషనింగ్, తగ్గిన శబ్దం దీర్ఘ ప్రయాణాలను ఆనందకరం చేశాయి.

సహజమైన హైబ్రిడ్‌ పనితీరు
టయోటా హైబ్రిడ్‌ ఇంజన్‌ నగర ట్రాఫిక్‌లో మృదువుగా పనిచేస్తుంది. హైవేల్లో స్థిరత్వం, ఇంధన ఆదా ప్రధాన ఆకర్షణలు. ఆల్‌–వీల్‌ డ్రైవ్‌ రెయిన్, స్నో, అసమాన రోడ్లకు సహాయపడుతుంది. సస్పెన్షన్‌ సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. తక్కువ స్పీడ్‌లో తేలికైన స్టీరింగ్, హైవేల్లో స్థిరత్వం. పెద్ద సైజ్‌ ఉన్నా మాన్యూవర్‌ చేయడం సులభం.

సరళమైన టెక్నాలజీ సపోర్ట్‌
పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్, వైర్‌లెస్‌ Apple CarPlay, Android Auto సాధారణం. డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే స్పష్టంగా యూఎస్‌బీ, సీ పోర్టులు, వైర్‌లెస్‌ చార్జింగ్‌ కుటుంబ అవసరాలకు సరిపోతాయి.

రోడ్‌ ట్రాఫిక్‌కు అనుకూల సేఫ్టీ
అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్, లేన్‌ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, పీడెస్ట్రియన్‌ డిటెక్షన్‌ వంటివి నిశ్శబ్దంగా పనిచేస్తాయి. బ్లైండ్‌–స్పాట్‌ మానిటరింగ్, 360–డిగ్రీ కెమెరా పార్కింగ్‌ను సులభతరం చేశాయి. ప్రాక్టికల్‌ స్టోరేజ్, మూడు వరుసలకు క్లైమేట్‌ కంట్రోల్, ఫోల్డబుల్‌ సీట్లతో కార్గో స్పేస్‌. స్కూల్‌ రన్స్‌ నుంచి వీకెండ్‌ ట్రిప్‌ల వరకు అనుగుణంగా మారుతుంది.

అమెరికాలో ధరలు ఇలా..
అమెరికాలో బేస్‌ మోడల్‌ 36 వేల డాలర్ల నుంచి హైబ్రిడ్‌ ట్రిమ్‌లు 45 వేల డార్ల వరకు ఉన్నాయి. 2025 చివర్లో డీలర్ల ద్వారా విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version