Homeబాలీవుడ్Bollywood Heroines: అప్పుడు అనామక అమ్మాయిలు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న హీరోయిన్లు.. ఎవరో గుర్తుపట్టండి?

Bollywood Heroines: అప్పుడు అనామక అమ్మాయిలు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న హీరోయిన్లు.. ఎవరో గుర్తుపట్టండి?

Bollywood Heroines: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సంచలనమవుతోంది. అలాంటి విషయాల గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి సెలబ్రిటీలే వీరు కూడా. చిన్నతనంలో వీరు షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ తో తెగ సందడి చేసేవారు. సినిమాల ఫంక్షన్ల సమయంలో హడావిడి చేసేవారు. క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా మైదానాలలో కేరింతలు కొట్టేవారు. ఇప్పుడు వారు పెద్దయ్యారు. ఒకప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవారు.. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు అయిపోయారు..

ఇటీవలి హిందీ చిత్రాలు గనక మీరు చూస్తే వారిని కచ్చితంగా గుర్తుపట్టవచ్చు. ఇంతకీ వారెవరంటే బాలీవుడ్ వెటరన్ స్టార్ చుంకి పాండే గారాలపట్టి, లైగర్ ఫేమ్ అనన్య పాండే, అలాగే షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్. షారుఖ్ ఖాన్, చుంకీ పాండే మధ్య బలమైన స్నేహం ఉంది. ఇంచుమించుగా వీరిద్దరూ తమ కెరియర్ ను కొన్ని సంవత్సరాల తేడాతో ప్రారంభించారు. షారుక్ ఖాన్ బాలీవుడ్ లో తిరుగులేని నటుడిగా చలామణి అవుతుండగా.. చుంకి పాండే కూడా మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. షారుక్ ఖాన్, చుంకి పాండే మధ్యే కాదు, వారిద్దరి కూతుళ్లు అనన్య పాండే, సుహానా ఖాన్ మధ్య మంచి స్నేహం ఉంది. అనన్య పాండే తో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు కూడా స్నేహం ఉంది.

అనన్య పాండే, సుహానా ఖాన్ గతంలో ఐపీఎల్ మ్యాచ్ లు చూసేందుకు మైదానాలకు వెళ్లేవారు. ముఖ్యంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లను అస్సలు మిస్ అయ్యేవారు కాదు. అప్పట్లో వీరు షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ సినిమాల పాటల విడుదల కార్యక్రమానికి హాజరయ్యేవారు. ఆ వేదిక వద్ద సందడి చేసేవారు. అప్పట్లో షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ కలిసి పాల్గొన్న వేడుకకు అనన్య పాండే, సుహానా ఖాన్ హాజరయ్యారు. దానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోకు అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తున్నది. ఆ ఫోటోను చూసిన వారంతా.. సుహానా ఖాన్, చుంకి పాండే ను గుర్తుపట్టలేకపోయామని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ప్రస్తుతం అనన్య, సుహానా బాలీవుడ్లో నటిస్తున్నారు. అనన్య పాండే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 సినిమా ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు హీరో విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ అనే సినిమాలో నటించింది. గత ఏడాది డ్రీమ్ గర్ల్ -2 సినిమా ద్వారా ఘనవిజయాన్ని అందుకుంది. సుహానా ఖాన్ దీ ఆర్చీస్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ లో విడుదలైంది. సుహానా ఖాన్ అమెరికాలో చదువుకుంది. అక్కడే నటనకు సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందింది. సుహానా ఖాన్ ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తోంది. పేరు పెట్టని ఆ సినిమాకు, నిర్మాతగా షారుఖ్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు, అంతేకాదు అందులో ఓ ప్రముఖ పాత్రలో కూడా నటిస్తున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version