Salman Khan: కండలు తిరిగిన దేహం.. ఎవరూ చేయలేని నటన.. వయసు దాటినా.. యంగ్ హీరోలకు పోటీనిచ్చే ఒకే ఒక్క హీరో సల్మాన్ ఖాన్. నాటి నుంచి నేటి వరకు సల్మాన్ ఖాన్ అంటే ఫ్యాన్స్ కు యమ క్రేజీ. ఇక బాలీవుడ్లో హీరోయిన్లు ఆయనతో నటించడానికి తెగ ఇష్టపడేవారు. ఈ క్రమంలో సల్లు భాయ్ కూడా చాలా మంది ప్రేమలో పడి వారితో ఎఫైర్స్ కొనసాగించాడు. దాదాపు 10 మంది వరకు ఈ కండల వీరుడి జీవితంలోకి వచ్చి వెళ్లిపోయారని టాక్. అయితే ఏ ఒక్కరూ శాశ్వతంగా ఉండలేకపోయారు. 60 ఏళ్లు వచ్చినా సల్మాన్ ప్రస్తుతం బ్యాచిలర్ లైఫ్ నే కొనసాగిస్తున్నాడు. అయితే అనధికారింగా ఈ హీరో ఓ అమ్మాయితో రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నట్లు బీ టౌన్ టాక్. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలో ఎంత మంది ముద్దుగుమ్మలు వచ్చి వెళ్లారో తెలుసుకుందాం.

షాహీన్ జెఫ్రీ:
సల్మాన్ ఖాన్ 19 ఏళ్ల వయసులో ఉండగానే షాహీన్ జెఫ్రీతో ప్రేమలో పడ్డాడు. ప్రముఖ నటుడు అశోక్ కుమార్ కూతురే షాహీన్. షాహీన్ మోడలింగ్ లో ఉండగా ఆమెను కలిశాడు. ఆ తరువాత వీరి ప్రేమ కొంతకాలం సాగింది.
సంగీత బిజ్లానీ:
1980లో సంగీత బిజ్లానీ మిస్ ఇండియా విజేత. ఆమె సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో వీరి పెళ్లి రద్దయింది. వీరి పెళ్లి కార్డులు కూడా కొందరికి పంచారట.

సోమి అలీ:
సల్మాన్ కు ఉన్న స్నేహితురాళ్లలో సోమి అలీ ఒకరు. వీరిద్దరు కొంతకాలం డేటింగ్ చేశారు. అయితే సల్మాన్ ఖాన్ కు మద్యం అలవాటు ఉందని చెప్పి సోమి అలి అతని నుంచి దూరమైంది. ఆయితే ఇప్పటికీ సల్మాన్, సోమి మంచి స్నేహితులే.

ఐశ్వర్యరాయ్:
సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ ల మధ్య ప్రేమ వ్యవహారం ఉందని బహిరంగంగానే వార్తలు వచ్చాయి. కానీ వీరు ఖండించకపోవడంతో నిజమని నమ్మారు. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమాతో వీరు ప్రేమలో పడ్డారు. ఆ తరువాత కొంతకాలం కలిసున్న వీరు 2002లో విడిపోయారు. అయితే ఆ తరువాత సల్మాన్ ఖాన్ కు, వివేక్ ఒబేరాయ్ కి గొడవ జరిగింది. వీరి గొడవకు ఐశ్వర్యరాయే కారణమని సమాచారం.
స్నేహ ఉల్లాల్:
అచ్చం ఐశ్వర్యరాయ్ లా ఉండే స్నేహ ఉల్లాల్ ప్రేమలోనూ సల్మాన్ మునిగి తేలాడు. వీరిద్దరు కలిసి ‘లక్కీ’ సినిమాలో నటించారు. ఆ తరువాత వీరు విడిపోయారు. స్నేహ ఉల్లాల్ తెలుగులోనూ ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, తదితర సినిమాల్లో నటించింది.

క్లాడియా సిసెలా:
క్లాడియా సిసెలా , సల్మాన్ ఖాన్ లు కలిసి పలు ఫంక్షన్లలో కనిపించారు. ఆమె గురించి ఎప్పుడూ మాట్లాడుతూ పొగిడేవారు. ఆ తరువాత వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అదేం జరగలేదు.

కత్రీనా కైఫ్:
సల్మాన్ ఖాన్ ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ తోనూ ప్రేమలో పడ్డాడు. చాలా మంది వీరిద్దరు కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని భావించారు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిల్వలేదు.

జరీనాఖాన్:
సల్మాన్ ఖాన్ సయాయంతో జరీనా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ‘వీర్’ సినమాలో కలిసి పనిచేసిన తరువాత ఎక్కడ చూసినా వీరు కలిసే కనిపించారు. కానీ వీరూ కలిసి ఉండలేదు.

జాక్వలిన్ ఫెర్నాండేజ్:
సల్మాన్ ఖాన్ కంటే చాలా చిన్న వయసు ఉన్నా.. జాక్వలిన్ సల్మాన్ ప్రేమలో మునిగిపోయింది. ఆ తరువాత వీరు కొన్ని హోటళ్లలో కలిసి కనిపించారు. కానీ వీరు కూడా కలిసి ఉండలేకపోయారు.

ఇలియా వంతూర్:
మోడల్ అయిన ఇలియా వంతూర్ సల్మాన్ ఖాన్ తో ప్రేమ వ్యవహారం జరిపినట్లు పుకార్లు బాగానే వచ్చాయి. రొమేనియా దేశానికి చెందిన ఇలియా భారతదేశ పర్యటనలు ఎక్కువగా చేసేవారు. అందుకు సల్మాన్ ఖానే కారణమని భోగట్టా..