Bollywood Heroes in South: బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత.. అనేంతలా బాహుబలి ఇండియన్ సినిమాలో తెచ్చిన మార్పులు అన్నీఇన్నీ కావు. పాన్ ఇండియా మూవీస్ అంటూ ముందుకొస్తున్నాయంటే.. ఆ మూవీ రేంజ్ ఏ వేరు. సౌత్ సినిమా క్రేజ్ పెంచిన ఈ మూవీతో దర్శకధీరుడు ఇండయన్ ఫేమస్ డైరెక్టర్ గా అవతరించాడు. డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. దీంతో సీనే మారిపోయింది. ప్రతిఒక్కరూ ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తున్నారు. బాలీవుడ్ హీరోలు, విలన్లు, హీరోయిన్స్ అందరూ సౌత్ సినిమాలో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం మన సౌత్ సినిమాల రికార్డులను బాలీవుడ్ స్టార్ లు కూడా బ్రేక్ చేయలేకపోతున్నారు.
ఒకప్పుడు తెలుగు హీరోలు హిందీలో నటించడానికి ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం సీన్ మారింది. టాలీవుడ్లో అప్పుడప్పుడు ఇతర భాషా నటులు నటించడం కూడా తెలిసిందే. కానీ ఇప్పుడు బాలీవుడ్ బడా హీరోలే.. సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ కోవలో ఇప్పటికే అజయ్ దేవ్‌గణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించారు. మరోవైపు సల్మాన్ కూడా చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీతో సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక సంజయ్ దత్.. కేజీఎఫ్ 2 మూవీ కంటే ముందే ఓ మూవీతో సౌత్ ఇండస్ట్రీని పలకరించినా.. ఇపుడు అధిరా..గా సౌత్ సహా పాన్ ఇండియా ప్రేక్షకులను తన నటనతో భయపెట్టారు. అంతకు ముందు సంజు భాయ్ నాగార్జున హీరోగా నటించిన చంద్రలేఖ’లో అతిథి పాత్రలో కాసేపు కనిపించారు.
Also Read: Modi Kendriya Vidyalaya: పెంచమంటే తగ్గించాడే.. మోడీ మార్క్ షాక్ ఇదీ
సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పలు తెలుగు సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించారు. అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం చిత్రంలో అమితాబ్ చిన్న పాత్రలో మెరిశారు. చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువుగా గోసాయి వెంకన్న పాత్రలో కనిపించారు. మరోసారి ఈయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’లో నటిస్తున్నారు.
సల్మాన్ ఖాన్.. చిరంజీవి హీరోగా నటిస్తోన్న గాడ్ ఫాదర్’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంతో సల్మాన్ తెలుగు ఎంట్రీ ఇవ్వనున్నారు. లూసీఫర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను తెలుగులో సల్మాన్ ఖాన్ చేేస్తున్నారు. ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ 20 రోజులు కేటాయించారు.
సైఫ్ అలీ ఖాన్.. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రామాయాణ గాథ ఆదిపురుష్ లో లంకేషుడైన రావణ బ్రహ్మ పాత్రలో నటింస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. త్వరలో రావణుడిగా తెలుగుతో పాటు ఇండియన్ ప్రేక్షకులను పలకరించనున్నారు.
రజినీకాంత్ హీరోగా వచ్చిన దర్బార్ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్‌గా కనిపించారు. ఆ తర్వాత మంచు విష్ణు హీరోగా నటించిన మోసగాళ్లు మూవీతో పాటు తాజాగా గని సినిమాతో తెలుగు ప్రేక్షకులను సైతం పలకరించారు.
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర వన్ అండ్ టూ సినిమాలతో వివేక్ ఒబెరాయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇదే సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలీవుడ్ షాట్‌గన్ శతృఘ్న సిన్హా అదరగొట్టారు . అంతకు ముందు ఒక తెలుగు సినిమాలో సిన్హా నటించారు.
బాలీవుడ్ ను దశాబ్దం పాటు ఒక్క ఊపు ఊపిన నటుడు మిథున్ చక్రవర్తి. ఇటీవలి కాలంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణిస్తున్నారు. ఓ మై గాడ్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా వచ్చిన గోపాల గోపాల చిత్రంలో మిథున్ చక్రవర్తి స్వామిజీ పాత్రలో నటించారు. జాకీష్రాఫ్ తెలుగులో ‘అస్త్రం’,శక్తి’, ‘పంజా’ చివరగా ‘సాహో’లో నటించారు.
బాలీవుడ్‌కి హీరోగా పరిచయమైనా.. ఆ తర్వాత విలన్ పాత్రలు కూడా పోషించిన నటుడు నీల్ నితిన్ ముఖేష్. ఆయన ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో నెగటివ్ క్యారెక్టర్ లో కనిపించారు. హిందీతో పాటు భోజ్‌పూరీ భాషల్లో హీరోగా నటించిన రవికిషన్.. అనేక తెలుగు చిత్రాల్లో నటించారు. రేసుగుర్రం, కిక్ 2 లాంటి చిత్రాలు తనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఒకప్పుడు బాలీవుడ్లో శశి కపూర్ తర్వాత సెకండ్ హీరోగా ఫేమసైన చుంకీ పాండే ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
బాలీవుడ్ తొలి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాకూడా నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా నటించిన బంగారు బాబులో గెస్ట్ అప్ఫీరియన్స్ ఇచ్చారు. ఆ తర్వాత కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన అడవి దొంగలో ఒక పాటలో మెరిసారు.
Also Read:JanaSena Party: ఉత్తరాంధ్ర జనసేనకు ఆయువు పట్టుగా మారుతోందా?
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Bollywood heroes in tollywood and other south film industry
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com