Homeబయోగ్రఫీస్Chef Sanjay Thumma: వంట మాస్టర్‌.. వాడుక భాష.. లోకల్‌ స్లాంగ్‌లో ఇచ్చిపడేశాడు!

Chef Sanjay Thumma: వంట మాస్టర్‌.. వాడుక భాష.. లోకల్‌ స్లాంగ్‌లో ఇచ్చిపడేశాడు!

Chef Sanjay Thumma: తెలుగు టీవీషోలలో వంటల ప్రోగ్రాంకు ప్రత్యేక స్థానం ఉంది. ఈటీవీ, మా టీవీలు కొన్నేళ్లపాటు ఈ ప్రోగ్రాం కొనసాగించాయి. ఈ కార్యక్రమాలకు బ్రాండెడ్‌ ఆయిల్, మసాలా తయారీ కంపెనీలు స్పాన్సర్‌ కూడా చేశాయి. ఇందులో ముగ్గురు నలుగురు తెలుగు వంట మాస్టర్లు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలతో మాస్టర్లకు కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇందులో అందరికంటే భిన్నంగా, అందరికీ అర్థమయ్యేలా వంటల గురించి అచ్చమైన తెలంగాణ స్లాంగ్‌తో ఆకట్టుకున్నారు మాస్టర్‌ సంజయ్‌ తుమ్మ ఆయన భార్య రాగిణి.

ఫుడ్‌ లవర్స్‌కు కిక్కించే వంటకాలు..
మనందరికీ భోజనం అంటే చాలా ఇష్టం. ఇటీవల వెరైటీ ఫుడ్‌ స్టాల్స్‌ వెలుస్తున్నాయి. అయితే బయటి ఫుడ్‌ కంటే ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్‌ ఆరోగ్యం అని వైద్యులు చెబుతుండడంతో చాలా మంది ఇళ్లలోనే వెరైటీలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గృహిణులు అయితే డిఫరెంట్‌ ఎక్ప్‌పర్‌మెంట్స్‌ చేస్తున్నారు. ఇందుకోసం టీవీషోలను తెగ చూసేస్తున్నారు. ఇందులో మాస్టర్‌ సంజయ్‌ తుమ్మ, ఆయన భార్య రాగిణి షో చాలా మందిని ఆకట్టుకుంది. జంటగా రకరకాల వంటలు చేస్తే.. అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

మన హైదరాబాదీనే..
సంజయ్‌ స్వస్థలం హైదరాబాదీనే. తెలంగాణ బిడ్డే. ఏడేళ్ల వయసు నుంచే వంటలు చేయడం ప్రారంభించాడు. వంటలు చేయడం ఇష్టం లేకపోయినా.. అనుకోని పరిస్థితులతో ఆయన చెఫ్‌గా మారిపోయి.. ఇప్పుడు రెసిపీ సైంటిస్ట్‌గా మారారు. అమ్మ కోసం వంట తయారు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏడేళ్ల వయసులో సంజయ్‌ తల్లి ఆనార్యోంతో ఆస్పత్రిపాలైంది. అక్కడ పెట్టే ఆహారం తల్లికి నచ్చకపోవడంతో సంజయ్‌ ఇంట్లో వంట తయారు చేసి తల్లికోసం ఆస్పత్రికి తీసుకెళ్లేవాడు. ఇలా మొదలైన వంటల ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతోంది. తర్వాత వంటచేయడం హాబీగా మారింది. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు కూడా చేశాడు. తర్వాత స్టార్‌ హోటళ్లలో వంటలు చేస్తూ రెస్టారెంట్లు స్థాపించే స్థాయికి ఎదిగాడు.

లోకల్‌ స్లాంగ్‌లో..
హైదరాబాద్‌కు చెందిన సంజయ్‌ యూట్యూబ్‌ చానెల్‌ కూడా నిర్వహిస్తున్నారు. ఆయన వంటచేసే తీరు చాలా మందికి నచ్చుతుంది. సబ్‌స్క్రైబర్స్‌ అడిగే ప్రశ్నలకు సంజయ్‌ సమాధానాలు కూడా చెబుతారు. దీంతో ఈటీవీ, మాటీవీ సంజయ్‌తో వంట ప్రోగ్రాంలు కూడా చేయించాయి. అయితే సంజయ్‌ కూట్యూబ్‌లో ఎక్కువగా ఇంగ్లిష్, హిందీలో వంటల తయారీ గురించి చెబుతారు. తెలుగు చానెళ్లలో కార్యక్రమాలతో తెలుగులో మాట్లాడాల్సి వచ్చింది. దీంతో పద ప్రయోగంలో ౖహె దరాబాదీ స్లాంగ్‌ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో తన భార్య రాగిణితో కలిసి మందు తాగుతూ ఓ వీడియో చేశాడు. తాజాగా తాటి ముంజల గురించి ఓ వీడియో చేశాడు. ఇందులోనూ అవతల పారదెంగాలి.. పీకి పారదొబ్బాలి.. లాంటి పదాలు వాడుతూ తెలంగాణ స్లాంగ్‌ను ఇచ్చి పారేశాడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version