Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 యమ జోరుగా సాగుతోంది. ఆడా – మగా అని తేడా లేకుండా చాలా బాగా ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటు ఆట పరంగా… అటు కంటెంట్ పరంగా బెస్ట్ ఇస్తున్నారు. గడిచిన సీజన్ తో పోలిస్తే ఈ సీజన్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ తమ పరిధి దాటి మరి ఆడటానికి ప్రయత్నం చేస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో అతి ముఖ్యమైన పదవి ఏమిటి అన్నది బిగ్ చూస్తున్న ప్రతి ఒక్క వీక్షకులకు తెల్సిందే.. నామినేషన్స్ తర్వాత అత్యంత ముఖ్యమైనది కెప్టెన్సీ టాస్క్. ఈ టాస్క్ లో విజేత అయ్యి కెప్టెన్ గా నిలిస్తే ఇమ్మునిటీ లభిస్తుంది. దాని వల్ల తర్వాత వచ్చే వారానికి నామినేట్ అవ్వకుండా ఉండవచ్చు. అందుకే కంటెస్టెంట్స్ ఎవ్వరూ ఈ కెప్టెన్సీ టాస్క్ ని అంత తేలికగా తీసుకోరు. తమ సామర్థ్యానికి మించి మరి ఆడతారు, ఎలాగైనా కెప్టెన్ అవ్వాలి అనుకుంటారు.
ప్రతి వారానికి గానూ బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల కోసం ఒక టాస్క్ జరుగుతూ ఉంటుంది. అలా పదకొండో వారానికి గాను బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కింద ” నీ ఇల్లు బంగారం కాను” అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ కి కెప్టెన్ యాంకర్ సంచాలకులుగా వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా జరుగుతున్న లీకుల నేపథ్యం లో పదకండో వారానికి గానూ కెప్టెన్ ఎవరు అయ్యారో తెలిసిపోయింది. మానస్ నాగులపల్లి కెప్టెన్ గా … రేషన్ మేనేజర్ గా సిరి హనుమంతు నిలిచిందని వినికిడి.