Bigg Boss 5 Telugu: టెలివిజన్ హిస్టరీలో కనీవినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్‌ను అందుకుంటూ నెంబర్ వన్ తెలుగు రియాలిటీ షోగా ఘనతను అందుకుంది బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టు, సరికొత్త టాస్కులు, గొడవలు, ఫైటింగులు, రొమాన్స్, ప్రేమ కహానీలు ఇలా ఎన్నో రకాల ఆసక్తికరమైన యాంగిల్స్‌ను చూపిస్తూ ఇది సూపర్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకునిపోతోంది. అందుకే సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదోది కూడా ప్రారంభం అయింది. ఆరంభం నుంచే దీనికి భారీ స్థాయిలో రేటింగ్ వస్తోంది.

కానీ ఎన్నడూ లేని నెగిటివిటీ కూడా మూటకట్టుకుంటుంది. మరీ ఇంత దారుణమా అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.అసలు బిగ్ బాస్ కి ఏమైంది… ఈ సారి ఆటపై పెద్దబాస్ కి ఇంట్రెస్ట్ లేదా… షో పై ఆసక్తి చూపించడం లేదా..? కంటెస్టెంట్స్ తీరు పై ఎందుకు ఇప్పటికి నోరు మెదపడం లేదు అనే సందేహాలు ప్రేక్షకుల నుండి వ్యక్తమవుతున్నాయి.
సాధారణం గా బిగ్ బాస్ ఇంట్లోకి రావడానికి ముందే షో నియమ నిబంధనలు గురించి కంటెస్టెంట్స్ కి తెలియచేస్తుంటారు. అందులో ఒకటి కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అని. ఒక వేళ ఇంట్లో కి వచ్చాక కూడా సభ్యులు ఇంగ్లీష్, హిందీ మాట్లాడితే కచ్చితంగా హెచ్చరిస్తారు. కానీ, ఈ సారి సీజన్ 5 ప్రారంభమై నాలుగు వారాలు గడుస్తున్నా ఇప్పటికి కంటెస్టెంట్స్ తీరు లో మార్పు రాలేదు. ఇప్పటికీ ఇష్టానుసారంగా ఇంగ్లీష్, హిందీ లోనే మాట్లాడుతున్నారు. ఒక్క పదం అంటే ఎదో అనుకోవచ్చు. కాని ఏ ఇద్దరి మధ్య సంభాషణ జరగాలి అంటే ఇంగ్లీష్, హిందీనే ఎంచుకుంటున్నారు. దీంతో వారి మాట్లాడేది ఏంటో అర్థం కాక ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. బిగ్ బాస్ ఒకసారి చెప్పండి, నాగార్జున సార్ మీరైనా గుర్తు చెయ్యండి, ఇది తెలుగు షో అంటూ సోషల్ మీడియాలో తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.
కంటెస్టెంట్స్ ఎక్కువగా బూతులు మాట్లాడేస్తున్నారు. దీంతో ప్రతిసారి బీప్ సౌండ్ వేయాల్సివస్తుంది అని మరో వాదన. ఇవే కాకుండా బిగ్ బాస్ సైతం ప్రతీ సారి పప్పులో కాలు వేస్తున్నాడు. చిన్న చిన్న పొరపాట్లతో నెటిజన్లకు అడ్డంగా దొరికిపోతున్నాడు. ఇంతకు ముందు సీజన్ లో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోతోనే ఆసక్తి కలిగించేవాడు. కాని ఈ సారి అలా జరగడం లేదని చూస్తున్న ప్రేక్షకులు అంటున్నారు.