Bigg Boss Telugu 5: బిగ్ బాస్ షో మొత్తానికి హోరా హోరి గా సాగుతుంది. బిగ్ బాస్ లో ఉన్న తొమ్మిది మంది కుటుంబ సభ్యులు టాప్ 5 లో చోటు సంపాదించుకోవడం కోసం పోటా పోటీగా కష్టపడుతున్నారు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నుండి తగినంత పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోలేకపోతున్నారని ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే 73 వ రోజు జరిగిన ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది.
బిగ్ బాస్ హౌస్ లో సోమవారం జరిగిన నామినేషన్ల తర్వాత మరుసటి రోజు మొదలయ్యే కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ చాలా చప్పగా సాగింది. దీనికి సిరి, షన్ను ల మధ్య జరిగిన గొడవే ప్రధాన కారణం. దీనికి తోడు బిగ్ బాస్ మిగతా కంటెస్టెంట్ల కంటే సిరి, షన్ను ల మధ్య జరిగిన డ్రామా మీదే ఎక్కువ కాన్సేన్ట్రేషన్ చేసాడు.
బిగ్ బాస్ లో 19 మంది ఉన్నప్పుడు కంటే తొమ్మిది మంది ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలని సిరి ని హెచ్చరించాడు షన్ను. నీ క్యారెక్టర్ గురించి బయట వాళ్ళు తప్పుగా అనుకోకూడదు అంటే మనం ఇద్దరం ఒకే బెడ్ పైన పడుకోకూడదు అని సిరి కి షన్ను సూచించాడు.
ఇదిలా ఉండగా సిరి కి షన్ను కి అనుకోకుండా మాటల యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం లో షన్ను, సిరి ఇద్దరూ ఏడ్చారు. సిరి అయితే ఏకంగా తలబాదుకుని ఏడ్చింది. ఆ తర్వాత బాత్రూం కి వెళ్లి గోడకి తల వేసుకుని బాదుకుంటూ ఏడ్చింది. అయితే ఈ గొడవ ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. అసలు సిరి, షన్ను ఎందుకు తిట్టుకుంటారో, ఎందుకు ఏడుస్తారో అసలు అర్ధం కాదు… అసలు వీళ్ళు నిజంగా ఏడుస్తన్నారా… లేక కంటెంట్ కోసం, స్క్రీన్ స్పేస్ కోసం ఇలా చేస్తున్నారా అన్న విషం మీద కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఏదైతేనేం మళ్ళీ సిరి, షన్ను ఒక్కటయ్యారు.. మరి ఎలాంటి గొడవలు అవుతాయో తెల్సుకోవాలంటే ప్రతిరోజు బిగ్ బాస్ చూడాల్సిందే మరి.