Bigg Boss 5 Telugu: ఆదివారం అయిన వెంటనే బిగ్ బాస్ ఇంటి సభ్యులకి అసలైన టాస్క్ నామినేషన్స్. నామినేషన్ ప్రక్రియలో ఇంటి నుండి బయటకి పంపడానికి ఎవరిని నామినేట్ చెయ్యాలి అనే విషయం పై తలలు పట్టుకుని మరి చర్చించుకుంటారు ఇంటి సభ్యులు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయం కూడా తెలియదు బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి. ప్రతి వారం వారం తన పంథాను మార్చుకుంటూ కొత్తగా నామినేషన్ల ప్రక్రియని ప్లాన్ చేస్తాడు బిగ్ బాస్. అలాగే నిన్న (సోమవారం) జరిగిన నామినేషన్ల ప్రక్రియ కూడా ఎప్పుడు జరగని విధంగా జరిగింది.
నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ మొట్ట మొదట కెప్టెన్ అని మాస్టర్ ని ప్రారంభించమన్నాడు బిగ్ బాస్. ఈ క్రమం లో నలుగురి ఇంటి సభ్యులని ఎంచుకుని, తగిన కారణాలు చెప్పి వాళ్ళని నామినేట్ చేసి జైల్లో పెట్టవలసిందిగా బిగ్ బాస్ కెప్టెన్ అని మాస్టర్ ని ఆదేశించాడు. అయితే కెప్టెన్ అని మాస్టర్ ముందుగా కాజల్ ని ఎంచుకోగా, తర్వాత సన్నీ, వరుసగా మానస్, షణ్ముఖ్ ఎంచుకుంటూ నామినేట్ చేసి తగిన కారణాలు చెప్పి జైల్లో పెట్టింది.
అసలు ట్విస్ట్: కాజల్, సన్నీ, మానస్, షణ్ముఖ్ ని జైల్లో వెయ్యగానే మొదటి లెవెల్ అయిపోయింది అని బిగ్ బాస్ అనౌన్సమెంట్ ఇచ్చాడు. లెవెల్ రెండు లో భాగం గా మిగతా నామినేట్ అవ్వని సభ్యులు బజర్ మోగిన ప్రతిసారి లివింగ్ ఏరియా లో ఉన్న సంకెళ్లని పట్టుకుని తమకి ఇష్టమైన వాళ్ళని జైల్లో నుండి విడిపించవచ్చని చెప్పాడు బిగ్ బాస్. ఇక చివరలో జైలులో మిగిలిన సిరి, రవి, మానస్, సన్నీ నామినేట్ అయ్యారు.
చిక్కుల్లో పడ్డ కాజల్: బిగ్ బాస్ మరోసారి కెప్టెన్ అని మాస్టర్ కి ఇంకో బంపర్ అఫర్ ఇచ్చాడు. ఇంటి సభ్యులలో నుండి ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని ఆదేశించగా ఇంకో ఆలోచన లేకుండా అని మాస్టర్ కాజల్ ని నామినేట్ చేసింది. అలా బిగ్ బాస్ ఇంటి నుండి పదో వారానికి గాను సిరి, రవి, మానస్, సన్నీ, కాజల్ నామినేట్ అయ్యారు.