BigBoss 5: ఎట్టకేలకు బిగ్‌బాస్ సీజన్5 నన్నటితో పూర్తయింది. ఇన్నిరోజులు ఇంటిసభ్యుల మీద జరిగిన హోరాహోరీ పోరులో అందర్నీ తట్టుకుని నిలబడి ప్రేక్షకుల మన్ననలను దక్కించుకుని.. విజేతగా నిలిచాడు సన్ని. మొదటి నుంచి తన కోపంతో కాస్త నెగిటివిటీ సంపాదించినా.. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకుల మనసును గెలుచుకుని.. ఇప్పుడు టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. ఈ టైటిల్ అందుకున్న సందర్భంగా ఎమోషనల్ అవుతూ మాట్లాడారు సన్ని. ఈ క్రమంలోనే సిరి, షణ్ముక్ రిలేషన్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మొదటి నుంచి వీరిద్దరి రిలేషన్ మీద అందరికీ డౌట్‌గా ఉండేది.. అందరికీ స్నేహితులుగా చెప్తూనే.. ప్రేమాయణం నడిపిస్తున్నారేమో అని టీవీల్లో చూసే ప్రేక్షకులు కూడా అనుకున్నారు. అయితే, ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చాడు సన్ని. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను గెలిపించినందుకు 19 మంది కంటెస్టెంట్లకు, ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపారు సన్ని. హౌస్‌లో ఎంత కొట్టుకున్నా.. మర్నాడే కలిసిపోవడం బహుశా ఈ సీజన్లోనే జరిగిందనుకుంటా.. అని చెప్పుకొచ్చాడు.
తను ఈ స్థానంలో నిలబడటానికి ప్రేక్షకులు, స్నేహితులతో పాటు… నాగార్జున మోటివేషన్ కూడా కారణమని.. అందుకు ధన్యవాదాలు తెలిపాడు సన్ని. ఆ తర్వాత షణ్ముఖ్ గురించి ఓ క్లారిటీ ఇస్తాను సర్.. ఈ విషయాన్ని ఇక్కడే మాట్లాడాలి. షణ్ముఖ్, సిరి అలాంటి మంచి స్నేహితులు దొరకడం నిజంగా నా అదృష్టం. నాకు, మానస్‌కి ఎలాంటి స్నేహమైతే ఉండేదో.. అంతే ప్యూర్ రిలేషన్ వాళ్లిద్దరి మధ్య చూశాను అని చెప్పుకొచ్చాడు. ఈ మాటతో షణ్ముఖ్ సన్నీకి ప్రేమతో హగ్ ఇచ్చాడు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Bigg boss 5 telugu winner vj sunny speech and gives clarity on shanmukh siri relation
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com