
ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,08,616 పరీక్షలు నిర్వహించగా 6,952 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,03,074 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 58 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 11,882కి చేరింది. 24గంటల వ్యవధిలో 11,577 మంది బాదితులు పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు.