Bithiri Sathi Remuneration: బిత్తిరి సత్తి.. వీ6తో తన డిఫెరెంట్ బిత్తిరి ఓవరాక్షన్ తో కామెడీ పండించి తెలుగు జనాలకు కామెడీ పంచాడు ఈ కమెడియన్ . ఆ చానెల్ నుంచి బయటకు వచ్చాక టీవీ9, సాక్షిలో చేసి ఇప్పుడు ఫ్రీలాన్స్ గా ఎక్కడ కామెడీ షోలు, కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు అయినా వాటిల్లో పాల్గొంటూ అలరిస్తున్నాడు. బుల్లితెరపై ఈవెంట్లు, షోలు, ప్రీరిలీజ్ ఈవెంట్లలోనూ హడావుడి చేస్తున్నారు.
ప్రస్తుతం తెలుగులో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే యాంకర్లుగా సుమ, శ్రీముఖి, ప్రదీప్ లాంటి వారు ఉన్నారు. ఇప్పుడు వారిని మించి బిత్తిరి సత్తి రెమ్యూనరేషన్ అందుకుంటూ తెగ ఫేమస్ అయ్యాడు.తెలంగాణ యాసలో ఇతడు చేసే కామెడీకి ప్రేక్షకాదరణ బాగా ఉంటోంది.
Also Read: Clean Chit To Aryan Khan: డ్రగ్స్ ఉచ్చులో అంత మునిగాక ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ నా?
ప్రస్తుతం విడుదలవుతున్న కొత్త సినిమాల స్టార్ హీరోలను ఇంటర్వ్యూలు చేస్తూ వైరల్ చేస్తున్నాడు. బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలకు ప్రేక్షకాదరణ బాగా ఉండడంతో ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీం, మహేష్ బాబు ‘సర్కారువారిపాట’ జనాలను అలరించాయి. ఈ క్రమంలోనే ఎఫ్3 టీం కూడా బిత్తిరి సత్తితో ఇంటర్వ్యూ చేయించుకుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి బిత్తిరి సత్తితో చేసిన ఇంటర్వ్యూ ట్రెండింగ్ గా మారింది. వెంకటేశ్ అయితే అచ్చు బిత్తిరి సత్తిలా మాట్లాడి నవ్వులు పూయించాడు.
ఈ ఇంటర్వ్యూలతో బిత్తిరి సత్తి ఇమేజ్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే డిమాండ్ కూడా బాగా వచ్చేసింది. ప్రస్తుతం బిత్తిరి సత్తి తీసుకునే రెమ్యూనరేషన్ చూసి మిగతా యాంకర్లు కూడా అవాక్కవుతున్నారు. బిత్తిరి సత్తి ఒక షో కోసం దాదాపు 4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ తీసుకుంటున్నట్టు సమాచారం. మిగతా యాంకర్లతో పోలిస్తే బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలు డిఫెరెంట్ గా ఉండడంతో ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. అతడి ప్రశ్నలు కామెడీ జనరేట్ చేసేలా ఉండడంతో సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కుతోంది.
అందుకే తెలుగు యాంకర్లు రూ.2 లక్షల నుంచి మూడు లక్షల లోపే తీసుకుంటే బిత్తిరి సత్తి ఏకంగా రూ.5 లక్షల వరకూ తీసుకొని అందరు యాంకర్లకు షాక్ లు ఇస్తుండడం విశేషంగా మారింది.
Also Read: Jagan Government: ఒకే ఒక చాన్స్ కు మూడేళ్లు.. ప్రజలకు చుక్కలు చూపించిన జగన్ సర్కారు
Recommended Videos:
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More