PFI Ban- Turkey: కాంగ్రెస్ ఎందుకు తన ఆఫీస్ ని అంకారా [టర్కీ ] లో తెరిచింది ?
కేవలం తన నగ్న శరీరాన్ని రేడియో తో కప్పి తీసిన పీకే సినిమా హీరో ఎందుకు టర్కీ ప్రథమ మహిళని కలిశాడు ?
ఇటీవలే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ [ఎస్ సీ వో] సమావేశం జరిగిన సమరకండ్ [ఉబ్జెకిస్థాన్ ] లో టర్కీ అధ్యక్షుడు ఏర్డోగాన్ ఎందుకు మాటి మాటికి భారత ప్రధాని నరేంద్ర మోడీ తో మాట్లాడడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు ?
ఇప్పటికే టర్కీ దేశం ఎఫ్ టీ ఏ ఎఫ్ విషయం లో గ్రే లిస్ట్ లో ఉంది? తాజాగా భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం టర్కీ నుంచి నిధులు భారత్ లోని వివిధ ఉగ్ర గ్రూపులకి చేరాయి అని నిరూపించే ఆధారాలు దొరికినప్పుడు ఆ విషయం బయటికి వచ్చినప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నాయకులు ఎందుకు మౌనంగా ఉండిపోయారు ?
Also Read: Review On ACB Cases: ఏసీబీ కొరడా ఝుళిపించేందుకు రెడీ అయిన జగన్.. ఎవరికి మూడుతుందో?
చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ బహిరంగంగా మొన్న మీడియా ముందుకు వచ్చాడు. కానీ ఇన్ని రోజులు జింగ్ పింగ్ ఏమయ్యాడు ? ఎందుకు సమరఖండ్ నుంచి ముభావంగా చైనా కి తిరిగి వెళ్ళిపోయాడు ?సీతారామ్ ఏచూరి కానీ ఇతర కమ్యూనిస్ట్ నాయకులు కానీ ఎందుకు మౌనంగా ఉండిపోయారు ? జిన్ పింగ్ గృహ నిర్భందం లో లేడు అని ఎందుకు ఖండించలేక పోయారు ?
అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మీద నిషేధం విధించడం అదీ అయిదేళ్లకే పరిమితం చేయడం మీద సోషల్ మీడియాలో కొన్ని సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఎవరూ కూడా పైన ఉదహరించిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఎందుకు లేరు ?
గత ఆరేళ్లు లేదా ఏడేళ్లుగా ప్రస్తుత హోమ్ మంత్రి అమిత్ షా మీద కానీ లేదా జాతీయ భద్రతా అధికారి అయిన అజిత్ ధోవల్ మీద కానీ సోషల్ మీడియాలో వెల్లువెత్తిన అసంతృప్తి తాలూకు వ్యాఖ్యలకి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
పీ ఎఫ్ ఐ కి నిధులు గల్ఫ్ దేశాలతో పాటు ప్రధానంగా టర్కీ కి చెందిన గూఢచార సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ నుంచి పాకిస్థాన్ ఐఎస్ఐ సహకారంతో భారత్ లోని వివిధ బ్యాంక్ ఖాతాల్లో లోకి దాదాపుగా 100 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. వీటి మూలాలు కనుక ఎఫ్ఏ టీ ఎఫ్ కి ఆధారాలతో సహా ఇస్తే టర్కీని ఎఫ్ ఏ టి ఎఫ్ బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. ఇప్పటికే గ్రే లిస్ట్ లో ఉండడం వల్ల ఇబ్బందులని ఎదుర్కుంటున్న టర్కీ కి బ్లాక్ లిస్ట్ లోకి వెళితే అది ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ రాజీనామాకి దారితీస్తుంది. లేదా ప్రజలే నిరసన తెలిపి దిగిపొమ్మనవచ్చు. అందుకే ఈ విషయంలో ఏమన్నా తనకి కన్సెషన్ దొరుకుతుందో ఏమో అని ఎర్డోగాన్ మోడీజీ తో సంభాషించడానికి విఫల యత్నం చేశారు. బహుశా కాంగ్రెస్ పార్టీ టర్కీ లోని అంకారా లో తన ఆఫీసుని ఎందుకు పెట్టిందో ఇప్పటికే అర్థం అయి ఉంటుంది. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా కనుక హిట్ అయిఉంటే ఈ పాటికి ఎంతో కొంత మొత్తం పక్కదారి పట్టి ఉండేది. మంచికో చెడుకో ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
పాకిస్థాన్ లో ఉగ్ర గ్రూపుల ని అంతర్జాతీయ ఒత్తిడిలకి తలవంచి ప్రభుత్వం నిషేధం విధించినా కొద్ది నెలలు స్తబ్దుగా ఉండి మరో కొత్తపేరుతో కొత్త వాళ్ళతో ఇంకో గ్రూపు ఏర్పాటు చేయడం దశాబ్దాలుగా కొనసాగుతూనే వస్తున్నది. పేరుకే కొత్త వాళ్ళు, కొత్త పేరు ఉంటుంది కానీ వెనక ఉండి నడిపించేది నిషేధానికి గురయిన సంస్థ నాయకులు మాత్రమే. ఎలాగయితే లాలూ ప్రసాద్ యాదవ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రీ దేవి చేత పాలన చేయించాడో మనకి తెలిసిందే. యూపీఏ చైర్ పర్సన్ పేరుతో మౌన మునిని అడ్డు పెట్టుకొని సోనియా ఎలా అ పాలన సాగించిందో మనకి తెలిసిందే ! పీ ఎఫ్ ఐ అనేది సిమీ కి కొత్త పేరు అంతే.
_ పాస్టర్ మైండ్ అహ్మదుల్లా
సిమీ వెనక ఉన్న మాస్టర్ మైండ్ అహ్మదుల్లా సిద్దికీ. 2001 లో సిమి మీద నిషేధం విధించారు. సిమి కి పాకిస్థాన్ ఐ ఎస్ ఐ తో నేరుగా సంబంధాలు ఉండేవి. ఎస్ ఐ ఏజెంట్ల కి సహకరించేది. ఆశ్రయం ఇచ్చేది. నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ని 1994 లో కేరళ లో స్థాపించారు. చాలా త్వరగానే కేరళలో వేళ్లూనుకుంది. కానీ వివాదాస్పద కార్యకలాపాలకి కూడా కేంద్ర బిందువు అయ్యింది. మరీ ముఖ్యంగా మత ఛాందస సంస్థగా చెడ్డపేరు తెచ్చుకుంది. 2003 లో ఎన్డీఎఫ్ సభ్యులు మత పరమయిన హింసకి పాల్పడి కేరళలోని ఖోజికోడ్ దగ్గర మారాద్ బీచ్ లో 8 మంది హిందువులని దారుణంగా హత్య చేశారు. దాంతో కేరళ పోలీసులు ఎన్ డి ఎఫ్ మీద నిషేధం విధించే అవకాశాలని పరిశీలించడం మొదలుపెట్టడం తో తన రూట్ ని మార్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. 2006 లో అంటే 2003 లో 8 మందిని హత్య చేసిన ఘటన జరిగిన తరువాత మూడేళ్లకి కోజిఖోడ్ లో సమావేశం పెట్టి అప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక లో పనిచేస్తున్న వివిధ సంస్థలని ఒకటిగా చేయాలని నిర్ణయించింది ఎన్ డి ఎఫ్ 1 కేరళలో నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్. కర్ణాటకలో – కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నీటి. తమిళనాడు లో మనిత నీతి పసరై. ఈ మూడు సంస్థలు కూడా వేరే వేరే పేర్లతో ఉన్నాయి కానీ మూడు కూడా ఎన్ డి ఎఫ్ ఛత్రం కింద పనిచేసేవి. ఈ మూడు సంస్థలు కలిసి ఒకే సంస్థగా ఏర్పడి దానికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరు పెట్టుకొని మనుగడలోకి వచ్చింది.
2006 లో ఢిల్లీ లోని రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ యాక్ట్ XXI 1860 కింద పీఎఫ్ఐ ని రిజిస్టర్ చేశారు. కుల, మత విచక్షణ లేకుండా అందరికీ సామాజిక,న్యాయపరమయిన స్వేచ్చని కల్పించాలి అనే లక్ష్యం తో ఈ సంస్థని ఏర్పాటు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ కి ఇచ్చిన ఆఫడవిట్ లో పేర్కొన్నారు. చూడడానికి,వినడానికి చాలా బాగుంది. కానీ వీళ్ళ లక్ష్యం ఏమిటో కేరళలోని ఒక పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ కోయ దీనికి ఆద్యుడు.
&ఇదీ దాని ముసుగు !
మరీ బహిరంగంగా తీవ్ర వాద కార్యకలాపాలు చేస్తే వెంటనే నిషేధం విధిస్తారు కాబట్టి ఒక ముసుగు కావాలి కదా ? ఇదిగో ఆ ముసుగు: బయటి ప్రపంచానికి తాము సేవ చేస్తున్నట్లు తెలియాలి అలాగే దేశ,విదేశాల నుంచి విరాళాలు రావాలి అంటే కొన్ని సంక్షేమ ప్రాజెక్ట్ లని బహిరంగంగా పనిచేస్తున్నట్లుగా చూపించాల్సి ఉంటుంది. అవి ‘స్కూల్ ఛలో ‘ అనే ప్రాజెక్ట్ ని ప్రారంభించింది పీఎఫ్ఐ. సెకండరీ స్కూల్ కి విద్యార్ధులని వెళ్ళడానికి ప్రోత్సాహిస్తున్నాము అంటూ ప్రచారం మొదలుపెట్టింది. దానికి ఇంకో పేరు కూడా పెట్టింది అది సర్వ శిక్ష గ్రామ్ ఒక విద్యార్ధిని దత్తత తీసుకోండి ‘ అంటూ దానికి జత చేసింది. ఏదో సేవ చేస్తున్నామని అనిపించుకోవడానికే ఇదంతా ! కానీ అంతర్గతంగా తీవ్ర వాద కార్యకలాపాలకి సహకరిస్తూ వాళ్ళకి నిధులని అందచేస్తూ దేశంలో అశాంతిని కలుగచేయడమే దాని లక్ష్యం. మొత్తం ప్లాన్ అంతా పాకిస్థాన్ ఐ ఎస్ ఐ ది. అమలు చేయడానికి ఒక చట్ట బద్ధమయిన రిజిస్టర్ కాబడ్డ సేవా సంస్థ కావాలి, అది పీఎఫ్ఐ అన్నమాట. ఇక నిధులు నేరుగా కాకుండా టర్కీ ఇంటెలిజెన్స్ సంస్థ ద్వారా వివిధ దేశాలకి నిధులు వెళ్ళి అక్కడ నుండి పి ఎఫ్ ఐ అనబడే సేవా సంస్థకి విరాళాల రూపంలో చిన్న చిన్న మొత్తాలలో వివిధ అక్కౌంట్ల లోకి చేరతాయి. కాబట్టి నిఘా సంస్థలకి అంత సులువుగా అనుమానం రాదు. ఇదంతా ఒక సాలె గూడు లాంటిది. ఎంతో ఓపికగా వేతకాల్సి ఉంటుంది. అందుకే ఇంత సమయం తీసుకుంది కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ.
నిషేదం తరువాత అసలు కధ ఇంకా మిగిలే ఉంది. పి ఎఫ్ ఐ తరుపున సుప్రీం కోర్టులో హిజాబ్ కేసులో వాదించడానికి ఏకంగా 12 మంది అడ్వకేట్లు పనిచేస్తున్నారు అంటే డబ్బు ఏ విధంగా వరదలై పారుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. అదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం తరుపున కేవలం ముగ్గురు అడ్వకేట్లు వాదిస్తున్నారు. ఇక పి ఎఫ్ ఐ నిషేధం మీద ఎన్ని రోజులు ఎంత మంది అడ్వకేట్లు అంటే కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు రంగంలోకి దిగుతారో రేపో మాపో తెలిసిపోతుంది. అంటే ఈ కథ ఇప్పుడే మొదలైంది. ఇంకా మున్ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో? ఎంతమంది ఇందులో చేరుతారో? పిఎఫ్ఐ నిషేధించకుండా కాపాడుతారో వేచి చూడాలి.
Also Read: YSR Kalyanamasthu and Shadi Thofa: 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా.. ఆ అర్హతలుంటేనే సాయమట
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Banned group pfi kept close ties with radical turkey group
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com