Balakrishna vs Jr. NTR : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలో మరోసారి గొడవలు జరుగుతున్నాయా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇప్పటి వరకు ఉన్న విభేదాలు ఒక్కసారిగా ఒకే ఫ్లెక్సీతో బయటపడ్డట్టుగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ శ్రేణులు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్ లోని నందమూరి తారక రామారావు సమాధి దగ్గర జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉదయాన్నే నివాళి అర్పించారు. ఇక వీరు వస్తారని తెలిసిన అభిమానులు సీ. జూ. ఎన్టీఆర్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
జూ. ఎన్టీఆర్ నివాళి అర్పించిన తర్వాత బాలకృష్ణ తండ్రి సమాధి దగ్గర పుష్పగుచ్చంతో నివాళి అర్పించారు. బాలయ్య తిరిగి వెళ్తుండగా జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగించమని టీడీపీ కార్యకర్తలకు చెప్పారని టాక్. వెంటనే అక్కడ ఫ్లెక్సీలు తొలగించారు కూడా. అయితే జూ. ఎన్టీఆర్ చాలా రోజులుగా రాజకీయాలకు, తాతయ్య స్థాపించిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు, వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు రీసెంట్ గా స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా తారక్ ఖండించలేదు. దీంతో జూ. ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా సాగుతోంది.
రీసెంట్ గా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రా కదలిరా అంటూ అచంటలో నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన ఓ సంఘటన ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. జూ. ఎన్టీఆర్ ఫోటో తో వచ్చిన ఫ్యాన్స్ తో టీడీపీ శ్రేణులు గొడవపడ్డారు. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ వేదికగా ఇదే విషయం నిరూపితమైంది. దీంతో అబ్బాయి వర్సెస్ బాబాయ్, జూ. ఎన్టీఆర్ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అన్నట్టుగా ఉందంటున్నారు నెటిజన్లు. అంతేకాదు కథానాయకుడు, మహానాయకుడు పేరుతో బాలకృష్ణ తన తండ్రి జీవిత కథ ఆధారంగా సినిమాలు తీశారు.
ఇందులో నందమూరి ఫ్యామిలీకి చెందిన కొందరు నటిస్తే.. కళ్యాణ్ రామ్ తన తండ్రి పాత్రను పోషించారు. ఇక తారక్ కూడా పెద్దాయన వయసులో ఉన్నప్పటి పాత్ర పోషిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ అవకాశం బాలయ్యనే తీసుకున్నారు. ఇక ఈ సినిమా పరాజయం చెందడంతో తారక్ లేనందునే ఈ సినిమా ఫ్లాప్ అయిందంటూ ఫ్యాన్స్ ప్రచారం చేశారు. మొత్తం మీద ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీని బాలయ్య తొలగించమని చెప్పారనడంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మరి చూడాలి ఈ విషయంపై బాలయ్య ఎలా స్పందిస్తారో…
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయించిన బాలకృష్ణ
ఎన్టీఆర్ వర్ధంతి సంధర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనపడటంతో ఆగ్రహంతో వెంటనే వాటిని తీసేయాలి ఆదేశించారు.
బాలకృష్ణ వచ్చిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ సీఎం సీఎం అంటూ అరిచారు. pic.twitter.com/ioXQbS8mYK
— Telugu Scribe (@TeluguScribe) January 18, 2024
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Balakrishna to remove junior ntr flexi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com