Homeఅంతర్జాతీయంIndus River : సింధు నదిలో బంగారం పంట.. ఇక పాకిస్తాన్‌ దరిద్రం పోయినట్లే!

Indus River : సింధు నదిలో బంగారం పంట.. ఇక పాకిస్తాన్‌ దరిద్రం పోయినట్లే!

Indus River : భారత్‌లో అలజడి సృష్టించాలని, భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్న మన దాయాది దేవం పాకిస్తాన్‌. భారత్‌పై పడి ఏడ్చే ఈ దేశం.. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. నిరుద్యోగం, రాజకీయ అనిశ్చితి, అవినీతి తదితర కారణాలతో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. అప్పులపైనే ఆధారపడుతోంది. చైనా, అమెరికా అందించే సాయంతోనే నెట్టుకొస్తోంది. ఇలాంటి తరుణంలో నక్కతోక తొక్కినట్లుగా ఆ దేశంలో బంగారం పంట పండింది. సింధూనది గర్భంలో భారీగా బంగారం నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ పాకిస్తాన్‌(జీఎస్‌పీ) వెల్లడించింది. నది గర్భంలో సుమారు 32.6 మెట్రిక్‌ టన్నుల బంగారం నిక్షేపాలు ఉన్నట్లు అంచనా వేసింది. దీని విలువ 600 బిలియన్‌ పాకిస్తానీ రూపాయలు(భారత కరెన్సీలో రూ.18 వేల కోట్లు) ఉంటుందని అంచనా వేసింది.

పాకిస్తాన్‌కు మంచి రోజులు..
సింధూనది, హిమాలయాల దిగువన టెక్నోనిక్‌ ప్లేట్స్‌ కదలికలు ఎక్కువగా ఉంటాయి. దీంతో బంగారం అణువులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ అణువులు సింధు నది ద్వారా ప్రవహిస్తూ పాకిస్తాన్‌ పరీవాహక ప్రాంతంలో వ్యాపించినట్లు జీఎస్పీ తెలిపింది. ఈ నిక్షేపాల గుర్తింపుతో పాకిస్తాన్‌కు మంచి రోజులు వచ్చాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాకిస్తాన్‌ ఆర్థిక కష్టాలు తీరుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

32 కిలోమీటర్ల పొడవు..
సింధునదిలో సుమారు 32 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండే బంగారు నిక్షేపాలు వెలికితీయడానికి చర్యలు చేపట్టనున్నట్లు పంజాబ్‌ ప్రావిన్స్‌(Panjab pravins) గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్‌ మురాద్‌ వెల్లడించారు. ప్రస్తుతం పంజాబ్‌ ప్రావిన్స్, ఖైబర్, ఫంఖున్వా ప్రావిన్స్‌ వంటి ప్రాంతాల్లో మాత్రమే పనెషావర్‌ బేసిన్, మర్దాన్‌ బేసిన్‌ వంటి ప్రాంతాల్లో కూడా బంగారం నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం. ఈ నిల్వలు వెలికి తీస్తే పేద దేశంగా మారుతున్న పాకిస్తాన్‌కు మంచి రోజులు వచ్చినట్లే. ఉగ్రవాదం, అంతర్గత పోరు, సైనిక తిరుగుబీటు మధ్య అశాంతిగా ఉన్న దేశంలో నిక్షేపాలు బయటపడడం ఆ దేశానికి అతిపెద్ద ఊరట. ఈ నిధులతో పాకిస్తాన్‌ మళ్లీ అభివృద్ధివైపు అడుగులు వేసే అవకాశం ఉంది. ఈ బంగారంతో పాకిస్తాన్‌ భవిష్యత్‌ మారే అవకాశం ఉంది.

సింధు నది చరిత్ర..
ఇదిలా ఉంటే.. సింధు నది(Sindhu River) ప్రపంచంలోనే పురాతన, పొడవైన నదులలో ఒకటి. ఇది ప్రారంభ నాగరికత అభివృద్ధిలో కీలకపాత్ర పోసించింది. సిందధులోయ నాగరికత 3,300–1300 బీసీ మధ్య ఉందని చరిత్ర చెబుతోంది. నది ఒడ్డునే నాగరికత వెలిసింది. 1947 అఖండ భారత్‌ విభజనకు ముందు సింధు నది భారత్‌లోనే ఉండేది. దేశ విభజన తర్వాత పాకిస్తాన్, భారత్‌ రెండింటి గుండా ప్రవహిస్తోంది. సింధు నది లేదా ఇండస్‌ నది, ముఖ్యంగా పాకిస్తాన్‌లో అనేక ప్రదేశాలకు జీవనాధారం అందించే మూలాధారంగా ఉంది. ఈ నదిలో సాధారణంగా నీరు, మట్టి, ఇసుక వంటి పదార్థాలు ఏర్పడతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular