Horoscope Today : ఈ రాశుల వారికి ఆకస్మిక ధన యోగం…12 రాశుల వివరాలు ఎలా ఉన్నాయంటే?

సమాజంలో గౌరవం పెరుగుతుంది.కొన్ని శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు.

Written By: NARESH, Updated On : November 24, 2023 8:30 am

Today Horoscope 2024

Follow us on

Horoscope Today : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 24న శుక్రవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మేషం, సింహం రాశుల వారికి ఆకస్మిక ధన లాభం జరగనుంది. అలాగే 12 రాశుల వివరాలు ఎలా ఉన్నాయంటే?

మేషరాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. అప్పులు చేస్తారు. ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా వాదనలకు దిగొద్దు. ఒక సమస్యతో బాధపడుతారు.

వృషభం:
కుటుంబ అవసరాలకు ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం పెంచుకోవడం కోసం ప్రణాళికలు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిథునం:
తల్లిదండ్రుల నుంచి ప్రేమను పొందుతారు. ఆరోగ్యం క్షీణించే అవకాశం. పెండింగు పనులను పూర్తి చేస్తారు. కొన్నింటిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.

కర్కాటకం:
కుటుంబంలో విభేదాలుంటే తొలగిపోతాయి. వాదనలకు ఎక్కువగా దిగొద్దు. కంటికి సంబంధించి సమస్య ఏర్పుడుతుంది.

సింహం:
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం. అయితే ప్రత్యర్థులు మీపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నిస్తారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య:
ఎంతటి సమస్యలున్నా ధైర్యంగా ముందుకు పోతారు. విద్యార్థులు అడ్డంకులను ఎదురిస్తారు. గురువుల సలహాతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

తుల:
కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి అనుకూల సమయం. ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. పోటీ పరీక్షల్లో పాల్గొన్న వారికి మంచి ఫలితాలు.

వృశ్చికం:
వ్యాపారులకు అనుకూల సమయం. పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా గడుపుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

ధనస్సు:
కొన్ని ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం:
వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండకపోవచ్చు. ఉద్యోగులు విధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేస్తారు.

కుంభం:
బంధువులను కలుస్తారు. ఆదాయం ఆందోళనకరంగా ఉంటుంది. ఇతరులను గుడ్డిగా నమ్మొద్దు. ఆదాయం పెంచుకునేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తారు.

మీనం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది.కొన్ని శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు.