https://oktelugu.com/

Gold Silver Prices : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఆశ్చర్యకంగా పసిడి ధరలు..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,120గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,800 కొనసాగుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2023 / 08:27 AM IST

    gold-price-bangaram-dhara

    Follow us on

    Gold Silver Prices : బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. వరుసగా ధరలు తగ్గుతున్నాయి. కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ తరువాత తగ్గుతున్నాయి. దీంతో శుభకార్యాలు నిర్వహించుకునేవారికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. 2023 నవంబర్ 23న గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    బులియన్ మార్కెట్ ప్రకారం.. నవంబర్ 24న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.61,970 గా ఉంది. నవంబర్ 23న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,850తో విక్రయించారు. గురువారం కంటే శుక్రవారం బంగారం ధరలు రూ.50 తగ్గింది దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,120గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,800 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.61,970 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,350 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,550తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.56,800 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,970తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56,800తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,970తో విక్రయిస్తున్నారు.

    బంగారం ధరలు తగ్గుతుంటే వెండి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,200గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం వెండి ధరలు రూ.200 మేర పెరిగాయి. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,200గా ఉంది. ముంబైలో రూ.76,200, చెన్నైలో రూ.79,200, బెంగుళూరులో 75,200, హైదరాబాద్ లో రూ.79,200తో విక్రయిస్తున్నారు.