
వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కారు రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయింది. అయితే కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నారు. అయినా అతడికి ఎలాంటి గాయం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటున్నారు. తన కారులో డ్రైవర్ ఒక్కడే విజయవాడ వెళ్తున్నారు. నెల్లూరులోని తెట్టు జంక్షన్ వద్ద ఈ కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. కాగా ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.