
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇంట విషాదం నెలకొంది. జగన్ మామ, వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. కడపజిల్లా వేముల మండలం గొల్లలల గూడూరుకు చెందిన ఆయన ప్రముఖ వైద్యుడు. ఆయన అంత్యక్రియకలు ఈరోజు మధ్యాహ్నం అక్కడే నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు జగన్ హాజరు కానున్నారు.