
మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు సబ్బంహరి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. విశాఖపట్నం సీతమ్మధారలోన సబ్బం హరి ఇంటికి సంబంధించిన ప్రహారీ గోడను కూల్చివేస్తున్నారు. అయితే గోడకూల్చివేతపై తనకు ఎలాంటి నోటీసులు అందజేయలేదని ఈ సందర్భంగా ఆయన నిరసనకు దిగారు. కాగా ఎందుకు కూల్చుతున్నారో తెలపాలని కోరగా మున్సిపల్ సిబ్బంది ఎటువంటి సమాధానం తెలుపలేదు.