
ఆంధ్రప్రదేశ్‌లో ఆక్రమణల కూల్చివేతపై ఉద్రిత్త వాతావారణం నెలకొంది. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మార్గంలో ఉన్న దుకాణాలను శనివారం ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై స్థానికులు ఆందోళన నిర్వహించారు. ఎక్స్‌కవేటర్లను అడ్డుకొని వాటిపై ఎక్కి కూర్చున్నారు. దీంతో అధికారులకు, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.