
దళితులు, మైనార్టీలపై దాడులకు నిరసనగా శుక్రవారం ఏపీ బంద్‌కు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా విజయవాడలో జరుగుతున్న నిరసనలు ఉద్రిక్తలకు దారి తీశాయి. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిరసనకారులు, పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురి మద్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పలువరు దళిత నేతలు మాట్లాడుతూ తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటూ పోలీసులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. దళితులు, మైనార్టీలపై దాడులు ఆపకపోతే రాబోయే కాలంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.