తిరుపతిలోని చంద్రగిరి కోటపైకి వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. శనివారం ఈ కోటకు వెళ్లిన వీరు ఆదివారం వరకు రాకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో 20 మంది పోలీసుల బృందం గాలింపు చర్యలు చేపట్టింది. రెస్క్యూటీం, గజ ఈతగాళ్లతో దుర్గం కోనేరులో జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ దొరకకపోవడంతో యువతీ, యువకుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.