
చిత్తూరు జిల్లాలో ఆక్రమణల తొలగింపులో భాగంగా టీడీపీ నాయకుల ఇళ్లను కూల్చివేయడంపై ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చౌడేపల్లి మండలం బోయకొండ ఆలయం వద్ద టీడీపీ సానుభూతి పరులు ఇళ్లను ఆదివారం అధికారులు జేసీబీలతో ఇళ్లను కూల్చివేస్తున్నారు. గతంలో ఇళ్ల కూల్చివేతపై స్థానికులు కోర్టుకు వెళ్లడంతో పరిహారం చెల్లించిన తరువాతే ఇళ్లను కూల్చివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరించి తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయని ఆందోళన చేశారు. దీంతో కొందరిని పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.