
ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మృతదేహాలు లభ్యమయిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకలం రేపింది. రాష్ట్రంలోని దినాజ్ పూర్ జిల్లా జమాల్పూర్ గ్రామంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకోగా పోలీసులు గుర్తించారు. అయితే వారిది హత్యా..? లేక ఆత్మహత్యా అనే ది తెలియడం లేదు. అయితే వారిది హత్యాగానే భావిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనపై ప్రాథమికంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, మతదేహాలనుపోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించామని తెలిపారు.