
అమరావతిలో రాజధాని కోసం చేపట్టిన ‘జనరణభేరి’సభకు వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. గురువారం ఉదయం నుంచి ఆయనను అడుగడుగునా అడ్డుకున్నారు. కాగా సభాప్రాంగణానికి వెళ్లకుండా పోలీసులు రూట్ మార్చారు. అంతేకాకుండా జనరణభేరి సభను నిర్వహించే వేదికకు కొద్ది దూరంలో చంద్రబాబు వాహనాన్ని ఆపారు. దీంతో ఆయన కాలినడకన రాజధానిని శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లారు. పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులతో వాగ్వాదం దిగడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. బహిరంగ సభకు అనుమతి ఉన్నా పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.