
వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాస్ చంద్రబోస్ సతీమణి సత్యనారాయణమ్మ ఆదివారం మృతి చెందారు, గత కొన్ని రోజులుగా బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆమె మరణంతో పిల్లి సుభాష్ ఇంట విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున సుభాష్ ఇంటికి చేరుకుంటున్నారు. కాగా సత్యనారాయణమ్మ అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.