- Telugu News » Ap » Piling of cm jagan for somashila canal phase 2
సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-2కు సీఎం జగన్ శంకుస్థాపన
నెల్లూరు జిల్లాలోని సోమశిల రిజర్వాయర్ ప్రాజెక్టు హైలెవర్ కెనాల్ ఫేజ్-2కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. వర్చువల్ విధానంలో తాడేపల్లి గూడెం క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమశిల హైలెవల్ ఫేజ్-1 పనులు ఇప్పటికే పనులు జరుగుతుండగా, ఫేజ్ -2 కోసం రూ. 460 కోట్ల వ్యయంతో పనులను సోమవారం ప్రారంభించింది. ఈ కాలువ ద్వారా ఉదయగిరి, వింజమూరు, దుత్తల్లూరు, ఆత్మకూరుతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాలకు […]
Written By:
, Updated On : November 9, 2020 / 03:18 PM IST

నెల్లూరు జిల్లాలోని సోమశిల రిజర్వాయర్ ప్రాజెక్టు హైలెవర్ కెనాల్ ఫేజ్-2కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. వర్చువల్ విధానంలో తాడేపల్లి గూడెం క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమశిల హైలెవల్ ఫేజ్-1 పనులు ఇప్పటికే పనులు జరుగుతుండగా, ఫేజ్ -2 కోసం రూ. 460 కోట్ల వ్యయంతో పనులను సోమవారం ప్రారంభించింది. ఈ కాలువ ద్వారా ఉదయగిరి, వింజమూరు, దుత్తల్లూరు, ఆత్మకూరుతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాలకు నీటి సౌలభ్యత ఉంటుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.