https://oktelugu.com/

తెలుగు బ్యూటీకి క్రేజీ ఛాన్స్ లు.. రవితేజతో కూడా !

తెలుగు సినీ పరిశ్రమ నుండి హీరోయిన్ గా ఎదిగిన తెలుగు అమ్మాయి ‘రీతూ వర్మ’. కానీ తెలుగులో కంటే.. తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. అదే సమయంలో మలయాళం నుంచి మంచి అవకాశాలను అందుకుంది. ఫలానా భాషలోనే నటించాలి, ఫలానా పాత్రలే చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదని చెప్పే ఈ హైదరాబాది అమ్మాయికి, నిజానికి తెలుగు హీరోలు మరియు దర్శకనిర్మాతలు ఇవ్వాల్సిన స్థాయిలో అవకాశాలు ఇవ్వలేదు. కేవలం తెలుగు అమ్మాయి కావడం వల్లే ఈమెకు ఛాన్స్ లు […]

Written By:
  • admin
  • , Updated On : October 13, 2020 / 04:06 PM IST
    Follow us on


    తెలుగు సినీ పరిశ్రమ నుండి హీరోయిన్ గా ఎదిగిన తెలుగు అమ్మాయి ‘రీతూ వర్మ’. కానీ తెలుగులో కంటే.. తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. అదే సమయంలో మలయాళం నుంచి మంచి అవకాశాలను అందుకుంది. ఫలానా భాషలోనే నటించాలి, ఫలానా పాత్రలే చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదని చెప్పే ఈ హైదరాబాది అమ్మాయికి, నిజానికి తెలుగు హీరోలు మరియు దర్శకనిర్మాతలు ఇవ్వాల్సిన స్థాయిలో అవకాశాలు ఇవ్వలేదు. కేవలం తెలుగు అమ్మాయి కావడం వల్లే ఈమెకు ఛాన్స్ లు రాలేదు అనే రూమర్ ఉన్నా.. మొత్తానికి ఈ తెలుగింటి బ్యూటీ టాలీవుడ్ నుండి కూడా తాజాగా మంచి సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతొంది.

    Also Read: బుల్లితెరపై కొరటాల మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా?

    అసలు రీతూ వర్మ షార్ట్ ఫిల్మ్ తో తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన చిన్న నటి. ‘అనుకోకుండా’ అనే షార్ట్ ఫిల్మ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శింపబడి ప్రముఖుల ప్రశంసలు అందుకుని.. అలా సినిమా అవకాశాలను సాధించింది. మొదట్లో ‘ప్రేమ ఇష్క్ కాదల్, నా రాకుమారుడు, ఎవడే సుబ్రమణ్యం వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించి.. ఆ తరువాత ‘పెళ్ళి చూపులు’ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించి పూర్తి స్థాయి హీరోయిన్ గా మారిపోయింది. అయితే ‘పెళ్లి చూపులు’ చిన్న సినిమాగా వచ్చి భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకున్నా ఈమెకు మన తెలుగు స్టార్స్ ఎవ్వరూ హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వలేదు.

    Also Read: సినీ జనాలకు మరింత ‘వినోదం’.. రంగంలోకి సీనియర్లు?

    కానీ రీతూ వర్మ టాలెంట్ ను తమిళ చిత్ర పరిశ్రమ గుర్తించింది. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఆమె నటన చూసి.. తనతో కలిసి నటించే అవకాశం ఇచ్చాడు. ఇక అప్పటి నుండి పలు తమిళ సినిమాలతో పాటు మలయాళ సినిమాలు కూడా చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాక ఈ తెలుగు అమ్మాయిని గుర్తించారు మన తెలుగోళ్ళు. ఏది ఏమైనా రీతూ వర్మకు తెలుగులో కూడా ప్రస్తుతం మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నానితో టక్ జగదీష్ చేస్తుంది. అలాగే యంగ్ హీరో శర్వానంద్ నటించే తెలుగు, తమిళ సినిమాతో పాటు మరో టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య సరసన రీతూవర్మ నటిస్తోంది. ఈ క్రమంలో రవితేజ – రమేష్ వర్మ చేయబోతున్న సినిమాలో కూడా రీతూ వర్మనే మెయిన్ హీరోయిన్ అట. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఈ బ్యూటీ బాగా బిజీ అయింది.