పాపం డబ్బులు కోసం ‘వేదిక’ మరి ఇంతగా !

హీరోయిన్ వేదిక.. శివకాశి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమయింది. ఆ తరువాత ముని, విశయదశమి, బాణం, దగ్గరగా దూరంగా అంటూ కొన్ని చిత్రాలలో తన అదృష్టం పరీక్షించుకున్న.. తనకు దక్కింది అయితే ఏమిలేదు. సక్సెస్ కోసం, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాల కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా వేదికకు చివరకు నిరాశే మిగిలింది. అయినా తాను మాత్రం ఎక్కడా తగ్గకుండా ఇంకా ఛాన్స్ లు కోసం ఆశగా ఎదురుచూస్తూనే ఉంది. కాకపోతే, ఈసారి […]

Written By: admin, Updated On : December 1, 2020 7:35 pm
Follow us on


హీరోయిన్ వేదిక.. శివకాశి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమయింది. ఆ తరువాత ముని, విశయదశమి, బాణం, దగ్గరగా దూరంగా అంటూ కొన్ని చిత్రాలలో తన అదృష్టం పరీక్షించుకున్న.. తనకు దక్కింది అయితే ఏమిలేదు. సక్సెస్ కోసం, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాల కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా వేదికకు చివరకు నిరాశే మిగిలింది. అయినా తాను మాత్రం ఎక్కడా తగ్గకుండా ఇంకా ఛాన్స్ లు కోసం ఆశగా ఎదురుచూస్తూనే ఉంది. కాకపోతే, ఈసారి వేదికలో చాల మార్పులు వచ్చినట్లు ఉన్నాయి. వయసులో ఉన్నప్పుడే, ఫిజిక్ సూపర్ గా ఉన్నప్పుడే గ్లామర్ షో చెయ్యాలని ఫిక్స్ అయినట్లు ఉంది.

Also Read: డిసెంబర్ 15 నుండి రాజకీయ సన్నివేశాల్లో ‘మహేష్’ !

అందుకే 30 ఏళ్ళు దాటినా ఈ సుందరి గత కొన్ని రోజులుగా తెగ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. సినిమాల్లో కన్నా… ఇన్ స్టాగ్రామ్ వేదికపై వేదిక గ్లామర్ ప్రదర్శనతో రెచ్చిపోతుంది. ఎందుకింతగా రెచ్చిపోతుందో తెలియదు గానీ, అవకాశాల కోసమే, ఆమె ఇలా ఎక్స్ పోజింగ్ చేస్తోందని అందరూ ఫీల్ అవుతున్నారు. పైగా … ఇన్ స్టాగ్రామ్ ద్వారా కూడా బోలెడెంతగా సంపాదించుకోవచ్చు అట. ఎంతగా గ్లామర్ ఫోటోలు పెడితే అంతగా ఫాలోవర్స్ పెరుగుతారని.. ఎలాగూ ఫాలోవర్స్ ఎంత ఎక్కువుగా ఉంటే అంతగా సంపాదన ఉంటుందని తెలిసిన విషయమే.

Also Read: నేషనల్ స్టార్ తో చిన్న సినిమా ఏంటో ?

అందుకే ప్రస్తుతం మాల్దీవులకు వెళ్తున్న హీరోయిన్ల ట్రిప్ మొత్తం ఖర్చులు, మాల్దీవుల టూరిజమ్ కంపెనీలు భరిస్తున్నాయనే రూమర్ కూడా కాస్త గట్టిగానే వినిపిస్తోంది. కొన్ని టూరిజమ్ కంపెనీలు అక్కడి టూరిజం ప్రమోషన్ కోసం ఇలా చేస్తున్నాయని.. అందుకే హీరోయిన్స్ అంతా ఇప్పుడు మాల్దీవుల బాట పట్టరాని, ఆ క్రమంలోనే వేదిక కూడా అక్కడ వాలిపోయి.. వలపుల వల విసిరిందని టాక్. ఫాలోవర్స్ బాగా ఉన్న హీరోయిన్లు బ్రాండ్స్ కు ప్రచారం చేసి ఒక్కో పోస్ట్ కి లక్షల్లో సంపాదించొచ్చు అందుకే వేదిక ఆ పద్దతిలో ముందుకుపోతున్నట్లు ఉంది. పాపం డబ్బులు కోసం వేదిక మరి ఇంతగా కష్టపడాల్సి వస్తోంది.

https://www.instagram.com/p/CINjBdNlXK4/

https://www.instagram.com/p/CIH_Zj5FMGZ/