
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. ఆ తరువాత ఆయన పవన్‌కల్యాణ్‌కు దూరంగా ఉంటూనే ఉన్నాడు. కొన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకున్నా అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాష్ట్ర మంత్రి కొడాలి నానిని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ పాలన ఆన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంనది ప్రశంసించాడు. అలాగే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారని, కరోనా పేరుతో ఎన్నికలను ఆపారని అన్నారు. ఇప్పుడు కరోనా విజృంభిస్తుంటే ఎన్నికలు నిర్వహించాలని అంటున్నారని పేర్కొన్నారు. అయితే జనసేన ఎమ్మెల్యే మంత్రి కొడాలి నానిని కలవడం చర్చనీయాంశంగా మారింది.