
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా సాగుతున్న పోలవరం ప్రాజెక్టుపై ఏమీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పోలవరం ప్రాజెక్టును టీడీపీ హయాంలోనే 71 శాతం పూర్తి చేశామని అన్నారు. 2018లో సవరించిన అంచనాల మేరకు రూ. 57 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే రూ. 55 వేల కోట్ల అంచనాను కేంద్రం ఆమోదించిందన్నారు. జగన్ తన అవగాహన రాహిత్యంతో రాష్ట్రానికి అన్యాయం చేయొద్దన్నారు. పోలవం ప్రాజెక్టు అన్యాయంపై మేధావులు మౌనం వీడాలన్నారు.