
హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంల ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన శ్రీ నివాస్ హైదరాబాద్ బీజేపీ కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. శరీరం కాలుతున్నా అతడు ‘బీజేపీ జిందాబాద్, బండి సంజయ్ అంటే నాకు ప్రాణం’ అంటూ అరిచాడు. ఆయన కోసం ఏమైనా చేస్తానని ఆవేశంగా అరిచాడు.