
ఇద్దరు వ్యక్తుల వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆంధ్రప్రదేశ్‌లోని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల కిందట పేకాట ఆడుతూ కొందరు పార్టీ నాయకులు పట్టుబడ్డారు. దీంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నేనే అధిష్టానానికి ఫిర్యాదు చేశానని భావింవి, నా గొంతు మార్ఫించేసి మాట్లాడుతున్నారు. నా వెంట పడుతూ ప్రాణహాని తలపెట్టేలా చూస్తున్నారు అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ పరిమాణాలతో సందీప్ అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తరువాత సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అందులో ఎమ్మెల్యే శ్రీదేవియే తనపై అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు.