
గ్రూప్-1 మెయిన్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 9,679 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిసారి ట్యాబ్ ఆధారిత ఆన్ లైన్ ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు అందించారు. ఈ పరీక్షలకు 9,679 మంది దరఖాస్తు చేసుకోగా 8,099 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. కరోనా వైరస్ పూర్తిగా తొలిగిపోనందుకు కోవడ్ నిబంధనల ప్రకారం అభ్యర్థులను హాల్ లోకి అనుమతిస్తున్నారు.