https://oktelugu.com/

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

కాలువలోకి కారు దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన మాధవ్‌ అనే వ్యక్తి బీరూగౌడ్‌, బాలాజీ, మహేశ్‌, ఆనంద్‌ అనే వ్యక్తులు గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌ వైపు వెళ్లాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం తంగెడమల్లకు రాగానే కాలువలోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. దీంతో మహేశ్‌, ఆనంద్‌, బీరుగౌడ్‌, బాలాజీ అనే వ్యక్తులు అక్కడే మృతి చెందారు. మాధవ్‌ అనే […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 16, 2020 / 09:18 AM IST
    Follow us on

    కాలువలోకి కారు దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన మాధవ్‌ అనే వ్యక్తి బీరూగౌడ్‌, బాలాజీ, మహేశ్‌, ఆనంద్‌ అనే వ్యక్తులు గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌ వైపు వెళ్లాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం తంగెడమల్లకు రాగానే కాలువలోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. దీంతో మహేశ్‌, ఆనంద్‌, బీరుగౌడ్‌, బాలాజీ అనే వ్యక్తులు అక్కడే మృతి చెందారు. మాధవ్‌ అనే వ్యక్తి గాయపడగా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రకాశం జిల్లా పామర్రులోని పనికోసం వెళ్తండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.