
మద్దతు ధరలపై వైకాపా ప్రభుత్వం చెప్పే మాటలన్నీ నిజమైతే రైతులెందుకు రోడ్డెక్కుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో వరి రైతులు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టమోటా రైతులు ఎందుకు రోడ్డెక్కాల్సి వచ్చిందని ప్రశ్నించారు. రైతుల ఆందోళన ప్రభుత్వానికి పట్టదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతు ఆందోళనలకు సంబంధించిన వీడియోను చంద్రబాబు ట్విటర్లో పోస్టు చేశారు. మద్దతు ధర ప్రకటించి వ్యవసాయాన్ని పండుగలా మార్చేశామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతులకిచ్చే మద్దతు ఇదేనా అని నిలదీశారు.