
విశాఖకు చెందిన ప్రముఖ నృత్యకారిణి శోభానాయుడు ఆనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా న్యూరోలాజికల్ సమస్యతో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించిన ఆమె అతి చిన్న వయసులోనే కూచిపూడి నృత్యం నేర్చుకన్నారు. సత్యభామ, పద్మావతి పాత్రల్లో రాణించారు. 1982లో నిత్య చూడామణి, 1991లో సంగీత నాటక అకాడమీ 1998లో ఎన్టీఆర్, 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అలాగే హైదరాబాద్ కూచిపూడి ఆర్ట్ అకాడమీకి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. విదేశాల్లోనూ ఆమె ప్రదర్శనతో మెప్పించారు.