
నెల్లూరులో రౌడీ గ్యాంగ్ హల్ చల్ అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు ఇప్పటివి కావని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పలు టీవీ ఛానెళ్లలో వచ్చిన వీడియోల్లో జరిగిన ఘటనలు గత ఏడాది డిసెంబర్లో జరిగినవని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, కొంత మంది ఉద్దేశ పూర్వకంగా తప్పడు ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే నిందితులపై రౌడీ షీటర్ తెరువనున్నట్లు డీజీపీ తెలిపారు.