
ఏపీలో కరోనా కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లేవని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. రాజమండ్రిలో కరోనా సోకిన మహిళ శాంపిల్స్ పుణే పంపామని తెలిపారు. పుణే ల్యాబ్ నుంచి రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నామన్నారు. రాజమండ్రి మహిళ యూకే నుంచి వచ్చారు కాబట్టే అనుమానాలున్నాయని చెప్పారు. కరోనా కొత్త స్ట్రెయిన్‌తో ప్రజల్లో ఆందోళన ఉందని, ప్రజలెవరూ భయాందోళన చెందొద్దని మంత్రి సూచించారు. విమానాశ్రయాల్లో ప్రత్యేక బృందాలు నియమించామని ఆళ్ల నాని తెలిపారు. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర మార్గదర్శకాలను అనుగుణంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది.