
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కరోనా కలకలం.. రెండు రోజులుగా సమావేశాలకు హాజరైన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావుకు కొవిడ్ -19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మంగళవారం శాసనసభలో ప్రసంగించారు కారుమూరి. పాజిటివ్ రావడంతో బుధవారం అసెంబ్లీకి హాజరుకాలేదు. అయితే కారుమూరి నాగేశ్వర రావుకు పాజిటివ్ గా తేలడంతో ఆయనతో దగ్గరగాఉన్నవారు ఆందోళన చెందుతున్నారు.