లీడింగ్ పార్టీలోకి ఒకప్పటి స్టార్ హీరోయిన్ !

ఈ మధ్య మాజీ హీరోయిన్స్ అంతా రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఒకప్పుడు ఒక ఊపు ఊపిన విజయశాంతి ఖుష్బూ దగ్గర నుండి కన్నడ హీరోయిన్ రమ్య, మాధవీలత వరకూ తెగ రాజకీయాలు చేసేస్తున్నారు. కాగా తాజాగా ‘రంగీలా’ హీరోయిన్ ఊర్మిళా మటోండ్కర్ కూడా రాజకీయం చేయడానికి శివసేనలో జాయిన్ అయిపొయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో ఊర్మిళా ఈ రోజు శివసేన కండువా కప్పుకుంది. మరి ఊర్మిళా ఏ రేంజ్ లో రాజకీయాలు […]

Written By: admin, Updated On : December 2, 2020 2:23 pm
Follow us on


ఈ మధ్య మాజీ హీరోయిన్స్ అంతా రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఒకప్పుడు ఒక ఊపు ఊపిన విజయశాంతి ఖుష్బూ దగ్గర నుండి కన్నడ హీరోయిన్ రమ్య, మాధవీలత వరకూ తెగ రాజకీయాలు చేసేస్తున్నారు. కాగా తాజాగా ‘రంగీలా’ హీరోయిన్ ఊర్మిళా మటోండ్కర్ కూడా రాజకీయం చేయడానికి శివసేనలో జాయిన్ అయిపొయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో ఊర్మిళా ఈ రోజు శివసేన కండువా కప్పుకుంది. మరి ఊర్మిళా ఏ రేంజ్ లో రాజకీయాలు చేస్తోందో తెలియదు గాని, మొత్తానికి లీడింగ్ పార్టీలో అయితే జాయిన్ అయిపొయింది.

Also Read: షకీలా జీవిత చరిత్రకి గ్రీన్ సిగ్నల్ !

పైగా ఆమెని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేసేందుకు ఠాక్రే అంగీకరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఊర్మిళా గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీచేసి మరీ ఓడిపోయింది. ఎలాగూ ఓడిపోయింది కాబట్టి.. ఇక ఆ తర్వాత సొంత పార్టీ నేతలే తనకి వ్యతిరేకంగా పనిచేసారని ఆరోపిస్తూ ఆమె గతేడాది కాంగ్రెస్ కి అందరిలాగే రాజీనామా చేసి ఇప్పుడు శివసేనలోకి వచ్చింది.

Also Read: మహేష్ బాబు ప్లేస్ లో బాలీవుడ్ స్టార్ !

ఇక ఇటీవల కంగనా రనౌత్ ఠాక్రే ప్రభుత్వంకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించి.. ఓ రేంజ్ లో శివసేనను ఆటాడుకుంది. ఆ సమయంలో శివసేన ప్రభిత్వానికి ఊర్మిళ బాగానే సపోర్ట్ చేసింది. ఒక విధంగా కంగనాకి గట్టిగా సమాధానం ఇవ్వడంలో ఊర్మిళ సక్సెస్ అయింది కూడా. అందుకే ఠాక్రే ప్రభుత్వం ఊర్మిళకు పార్టీలోకి వెల్కమ్ చెప్పింది. కాకపోతే ఊర్మిళ రాజకీయం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్